Arjun Sarja: స్టార్ హీరో అర్జున్ సర్జా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తెలుగు, తమిళ్, కన్నడలో హిట్ సినిమాలను అందించిన అర్జున్ ఈ మధ్యనే తెలుగులో విశ్వక్ సేన్ తో కలిసి ఒక సినిమా డైరెక్ట్ చేయబోయాడు. అయితే విశ్వక్ తో వివాదం వలన ఆ సినిమా పట్టాలెక్కకుండానే ఆగిపోయింది. అదే సినిమా కథతో మరో హీరోతో చేయనున్నట్లు సమాచారం. ఇక ఈ సినిమాలో అర్జున్ కుమార్తె ఐశ్వర్య అర్జున్ హీరోయిన్ గా నటిస్తుంది. ఇక అందుతున్న సమాచారం ప్రకారం అర్జున్ కూతురు ఐశ్వర్య పెళ్లి పీటలు ఎక్కనుందని టాక్ నడుస్తోంది. కొన్నేళ్లుగా ఐశ్వర్య.. కోలీవుడ్ స్టార్ కమెడియన్ తంబీ రామయ్య కొడుకు ఉమాపతి రామయ్య తో ప్రేమలో ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇక ఈ మధ్యనే వీరి పెళ్ళికి రెండు కుటుంబాలు కూడా ఒప్పుకున్నట్లు తెలుస్తోంది. త్వరలో వీరి పెళ్లి ఘనంగా జరగుతుందని వార్తలు వినిపిస్తున్నాయి. త్వరలోనే అర్జున్.. ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించనున్నాడట.
NTR: ఎన్టీఆర్ వీరాభిమాని మృతి.. విషాదంలో ఫ్యాన్స్
తంబీ రామయ్య.. గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ప్రస్తుతం పవన్- సాయి ధరమ్ తేజ్ నటిస్తున్న బ్రో ఒరిజినల్ వెర్షన్ వినోదయ సీతాం సినిమాలో తంబీ రామయ్య లీడ్ రోల్ లో నటించి మెప్పించాడు. ఈ సినిమా తరువాత ఆయనకు మంచి పేరు వచ్చింది. ఇక తంబీ రామయ్య కొడుకు ఉమాపతి కూడా హీరోనే. 2017 లో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. ఇప్పటికి నాలుగు సినిమాల్లో నటించాడు. ఒక సినిమా షూటింగ్ లోనే ఐశ్వర్యతో ఉమాపతి పరిచయం అయ్యిందని, అదే ప్రేమకు దారితీసిందని తెలుస్తోంది. ఇందులో నిజమెంత అనేది తెలియాల్సి ఉంది.
