Site icon NTV Telugu

‘పుష్ప’ లో నటించను అంటే సుకుమార్ అలా చేసి ఒప్పించారు

ajay ghosh

టాలీవుడ్ లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మంచి పేరు తెచ్చుకొంటున్నాడు అజయ్ ఘోష్.. రంగస్థలం నుంచి నిన్న రిలీజ్ అయిన ‘పుష్ప’ వరకు అజయ్ నటన ప్రేక్షకులను అలరిస్తోంది. ఇక ‘పుష్ప’ లో అజయ్ నటించిన ముఠా నాయకుడు కొండారెడ్డి పాత్ర ప్రేక్షకులకు చాలాకాలం పాటు గుర్తుండిపోతుంది అనడంలో ఎటువంటి సందేహం లేదు.. ముఠా నాయకుడిగా ఆ గంభీరమైన రూపం దానికి తగ్గ వాయిస్ ఆ పాత్రను ఒక రేంజ్ లో నిలబెట్టాయి. అయితే మొదట్లో ఈ పాత్ర చేయను అని చెప్పారట అజయ్.. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా ఒక ఇంటర్వ్యూ లో తెలిపారు.

” ‘పుష్ప’ మొదలైనప్పుడు ఈ పాత్ర కోసం మైత్రి ఆఫీస్ నుంచి ఫోన్ వచ్చింది. ఆ సమయంలో నేను కరోనా బారిన పడి అప్పుడే కోలుకొంటున్నాను. కరోనాతో నాలో భయం ఎక్కువైంది. ఒంటరిగా అన్ని రోజులు ఒకే గదిలో ఉండేసరికి మనుషులన్నా, బయట తిరగాలన్నా భయంతో వణికిపోయేవాడ్ని. ఆ భయంతోనే ఈ ఆఫర్ ని వద్దు అన్నాను. నేను చేయలేను నన్ను వదిలేయండి అని చెప్పాను. అప్పుడు సుకుమార్ స్వయంగా ఫోన్ చేసి నాకు దైర్యం చెప్పారు.. ఎంతో మర్యాదగా మాట్లాడి నన్ను ఒప్పించారు. అంతేకాకుండా సెట్ లో కూడా అంతే గౌరవంగా చూసుకొన్నారు. ఆ సమయంలో సుకుమార్ చెప్పిన మాటలు నన్నెంతో ప్రభావితం చేశాయి.. ఇప్పుడు ఆయన నాకు ఒక డైరెక్టర్ మాత్రమే కాదు.. నా కోసం దేవుడు పంపిన దేవదూత” అని చెప్పుకొచ్చారు.

Exit mobile version