Site icon NTV Telugu

Aditya Om: గ్రామీణ ప్రాంతాల్లో ఆదిత్య ఓం అంబులెన్స్ సేవలు!

Aditya Om

Aditya Om

Aditya Om:పలు తెలుగు, తమిళ, హిందీ సినిమాల్లో నటించి సిల్వర్ స్క్రీన్‌పై తనకంటూ ఓ గుర్తింపు సంపాదించుకున్నాడు ఆదిత్య ఓం. దర్శకుడిగా కూడా తనదైన ముద్ర వేసుకుంటున్న ఆదిత్య ఓం సేవారంగంలో తన ఔదార్యాన్ని చాటుతున్నాడు. పలు సేవా కార్యక్రమాలు ద్వారా ఆయన ఇప్పటికే ఎంతో మందికి మంచి చేశారు. తెలంగాణలోని భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని ఐదు గ్రామాలను దత్తత తీసుకుని, దాదాపు 500 మందికి సహాయం చేశారు. అలానే తాండూరు సిటీ ఫీవర్ హాస్పిటల్ లోనూ సేవాకార్యక్రమాలు నిర్వహించడమే కాకుండా, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చెరుపల్లి, కొత్తపల్లి పరిసర ప్రాంతాలకు అంబులెన్స్ సేవలను అందించడానికి తన వంతు కృషి చేశారు.

అక్కడి గిరిజన గ్రామాల్లో చాలా కాలంగా పనిచేస్తున్న ఆదిత్య ఓం కోవిడ్ సమయంలో అంబులెన్స్ సేవలు లేకపోవడం, ఆ ప్రాంతంలో  పాము కాటు కారణంగా ప్రజలు ప్రాణాలు కోల్పోవడం చూసి చలించారు. దాంతో స్థానిక రోటరీ క్లబ్ తో పాటు తన స్నేహితుల, స్వచ్ఛంద సంస్థల సహకారంతో ఈ సేవలను ప్రారంభించారు. ఇవాళ ఈ అంబులెన్స్ కారణంగా కొంతమంది ప్రాణాలైనా కాపాడగలగడం ఆనందం ఉందని ఆదిత్య ఓం చెప్పారు.

Exit mobile version