Site icon NTV Telugu

RRR: అక్కడ అకాడెమీ అవార్డ్ గెలుచుకున్న ఆర్ ఆర్ ఆర్

Rrr

Rrr

ఆర్ ఆర్ ఆర్ సినిమా రిలీజ్ అయ్యి ఏడాది కావొస్తున్నా ఇంకా జోష్ తగ్గలేదు. రోజురోజుకీ ఆర్ ఆర్ ఆర్ మూవీ డిమాండ్ పెరుగుతూనే ఉంది. ముఖ్యంగా జపాన్ లో ఆర్ ఆర్ ఆర్ మూవీ క్రేజ్ ఆకాశాన్ని తాకుతుంది. జపాన్ లో అక్టోబర్ 21న రిలీజ్ అయిన ఆర్ ఆర్ ఆర్ మూవీ 95 రోజులైనా బాక్సాఫీస్ ని షేక్ చేస్తూనే ఉంది. ఇప్పటివరకూ ఆర్ ఆర్ ఆర్ సినిమా 650 మిలియన్ ఎన్స్ రాబట్టింది అంటే ఇండియన్ కరెన్సీలో 40 కోట్లు. నాలుగు లక్షలకి పైగా ఫుట్ ఫాల్స్ వచ్చాయి అంటే ఆర్ ఆర్ ఆర్ మూవీని చూడడానికి జపనీస్ సినీ అభిమానులు ఎంత ఈగర్ గా వెయిట్ చేస్తున్నారో అర్ధం చేసుకోవచ్చు.

ఇదిలా ఉంటే జపాన్ 46న అకాడెమీ అవార్డ్స్ లో ‘అవుట్ స్టాండింగ్ ఫారిన్ ఫిల్మ్’ కేటగిరిలో ఆర్ ఆర్ ఆర్ సినిమా అవార్డుని గెలుచుకుంది. అవతార్ 2, టాప్ గన్ మెవరిక్ లాంటి హాలీవుడ్ సినిమాలని కూడా వెనక్కి నెట్టి ఆర్ ఆర్ ఆర్ సినిమా ఈ జపాన్ అకాడెమీ అవార్డుని సొంతం చేసుకుంది. వరల్డ్ బాక్సాఫీస్ ని షేక్ చేస్తున్న అవతార్ 2 లాంటి సినిమాని దాటి మన సినిమా అవార్డు గెలుచుకోవడం చిన్న విషయం కాదు. ప్రస్తుతం ఆర్ ఆర్ ఆర్ మూవీ ఆస్కార్ రేస్ లో ఉంది. జనవరి 24న ప్రకటించబోయే ఆస్కార్ నామినేషన్స్ లో ఆర్ ఆర్ ఆర్ సినిమా చోటు సంపాదించినా, ఏ కేటగిరిలో ఒక్క అవార్డ్ గెలుచుకున్నా రాజమౌళి అండ్ టీమ్ వెస్ట్రన్ ఆడియన్స్ ముందు ఇండియన్ జెండాని ఎగరేసినట్లే.

https://twitter.com/RRR_twinmovie/status/1617398872657231876

Exit mobile version