Site icon NTV Telugu

Kannappa: మంచు విష్ణు కోసం బాహుబలి యాక్షన్ కొరియోగ్రాఫర్

Kannappa Kecha

Kannappa Kecha

Action director Kecha Khamphakdee of Bahubali fame will design the action for Kannappa: మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్ ‘కన్నప్ప’ కోసం జవాన్, బాహుబలి యాక్షన్ కొరియోగ్రాఫర్ కెచా రంగంలోకి దిగారు. మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్ కన్నప్ప ఇప్పుడు పాన్ ఇండియా స్థాయిలో ట్రెండ్ అవుతున్న సంగతి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనే లేదు. ప్రభాస్, మోహన్ లాల్, శివ రాజ్ కుమార్ వంటి భారీ స్టార్ కాస్ట్ తో ఈ కన్నప్ప సినిమా తెరకెక్కుతోంది. ఇలాంటి కన్నప్ప సినిమా కోసం అంతర్జాతీయ యాక్షన్ కొరియోగ్రాఫర్ ఒకరు రంగంలోకి దిగారు. బాహుబలి, జవాన్, పొన్నియిన్ సెల్వన్ వంటి భారీ ప్రాజెక్టు‌లకు ఫైట్స్ కంపోజ్ చేసిన కెచా ఇప్పుడు కన్నప్ప సినిమా కోసం పని చేయనున్నారు. నిజానికి ఆయా సినిమాల్లో కెచా కంపోజ్ చేసిన పోరాట సన్నివేశాలకు అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు లభించింది. కన్నప్ప కోసం ఆయన కంపోజ్ చేయబోయే సీక్వెన్సులు ప్రేక్షకుల్ని సీటు అంచున కూర్చోబెట్టేస్తాయని మేకర్స్ చెబుతున్నారు.

Adimulapu Suresh: దళిత యువకుడిపై దాడి, మూత్రవిసర్జన ఘటన.. టీడీపీకి మంత్రి సవాల్‌

మంచు విష్ణు ఈ కన్నప్ప సినిమాను అంతర్జాతీయ స్థాయిలో తెరకెక్కిస్తున్న క్రమంలో ప్రాచీన ఇండియన్ వార్ సీన్స్ ను మళ్లీ తెరపైకి తీసుకురానున్నారు. నాడు వాడిన ఆయుదాలు, నాడు జరిగిన పోరాటలు, హై ఆక్టేన్ యాక్షన్ సీక్వెన్స్‌తో కన్నప్పను భారీ ఎత్తున నిర్మిస్తున్నారు మోహన్ బాబు. ప్రేక్షకులను థ్రిల్ చేసే పోరాట సన్నివేశాలెన్నో ఈ సినిమాలో ఉన్నాయని, వాటిని కెచా అద్భుతంగా కంపోజ్ చేస్తారని అంటున్నారు. అంతేకాదు ఆయన రాకతో కన్నప్ప సినిమా మరో స్థాయికి వెళ్లిందని అంటున్నారు. కన్నప్ప సినిమాను చూసిన ప్రేక్షకులకు కచ్చితంగా కొత్త అనుభూతి కలుగుతుంది అంటూ కన్నప్ప టీం చెబుతోంది. థాయ్ లాండ్, హాంకాంగ్ వంటి దేశాల నుంచి 80 మంది ఫైటర్లను కూడా కన్నప్ప సెట్స్ మీదకు తీసుకు రాగా వారందరితో కెచా కంపోజ్ చేసే యాక్షన్ సీక్వెన్స్‌లు మాస్టర్ పీస్‌లా ఉండబోతున్నాయని ఈ యాక్షన్ సీక్వెన్స్‌లు ప్రేక్షకుల్ని మంత్రముగ్దుల్ని చేయనున్నాయని అంటున్నారు.

Exit mobile version