NTV Telugu Site icon

Acharya Movie Twitter Review : టాక్ ఏంటంటే?

Acharya

Acharya

మెగాస్టార్ చిరంజీవి, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కలిసి నటించిన ‘ఆచార్య’ ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ‘ఆచార్య’లో చిరు, చరణ్‌లు తొలిసారిగా పూర్తిసాయిలో స్క్రీన్ స్పేస్ షేర్ చేసుకుంటుండడంతో ప్రేక్షకుల్లో సినిమాపై ఉత్కంఠ నెలకొంది. కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో పూజా హెగ్డే కీలక పాత్రలో కనిపించనుంది. ఈ చిత్రాన్ని కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ, మ్యాట్నీ ఎంటర్‌టైన్‌మెంట్ పై నిరంజన్ రెడ్డి, అన్వేష్ రెడ్డి సంయుక్తంగా నిర్మించగా, మెలోడీ బ్రహ్మ మణిశర్మ సంగీతం అందించారు. ఈ మెగా యాక్షన్ డ్రాను థియేటర్లలో చూడడానికి ప్రేక్షకులు ఆతృతగా ఎదురు చూస్తున్నారు. అయితే ఇప్పటికే ఈ సినిమా యూఎస్‌లో ప్రీమియర్ కాగా, ఆ షోలు చూసిన ప్రేక్షకులు సోషల్ మీడియా వేదికగా తమ అభిప్రాయాలను పంచుకుంటున్నారు. అసలు సినిమా ఎలా ఉందో వాళ్ళ ట్వీట్లలోనే చూసేద్దాం. అయితే ఇదంతా ప్రేక్షకుల ఒపీనియన్ మాత్రమే. ‘ఆచార్య’ ఎలా ఉందొ తెలియాలంటే రివ్యూ వచ్చేదాకా వెయిట్ చేయాల్సిందే.

Read Also : VD11 : సామ్ కు రౌడీ హీరో స్వీట్ సర్ప్రైజ్