NTV Telugu Site icon

‘ఆచార్య’ మూవీ రిలీజ్ డేట్ ఫిక్స్

మెగాస్టార్‌ చిరంజీవి ఫ్యాన్స్‌కు గుడ్‌ న్యూస్‌. మెగా ప్యాన్స్‌ అంతా ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్నా ఆచార్య మూవీ రిలీజ్‌ డేట్‌ వచ్చేసింది. వచ్చే ఏడాది 2022 ఫిబ్రవరి 4న ఈ సినిమాను విడుదల చేయబోతున్నట్లు ట్విట్టర్‌ ద్వారా ప్రకటించారు హీరో రామ్ చరణ్. కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో చిరుకు జోడిగా కాజల్‌ అగర్వాల్‌ నటిస్తోంది.ఈ చిత్రంలో చిరు, చరణ్ ఇద్దరూ నక్సలైట్లుగా కనిపిస్తారు. ఆయన ప్రియురాలిగా పూజా హెగ్డే కనిపించబోతోంది. ఈ చిత్రంలో సిద్ధ అనే కీలక పాత్ర పోషిస్తున్నాడు రామ్‌ చరణ్‌. ఈ చిత్రానికి మణిశర్మ సంగీతం అందిస్తున్నారు. ఇక ఈ సినిమా రిలీజ్‌ డేట్‌ ఫిక్స్‌ కావడంతో మెగా ఫ్యాన్స్‌ లో కొత్త ఉత్సాహం నెలకొంది.