Site icon NTV Telugu

Acharya: మెగా ట్రీట్.. చిరు, చరణ్ ల మాస్ డాన్స్ వచ్చేది ఎప్పుడంటే..?

Acharya..

Acharya..

మెగాస్టార్ చిరంజీవి, కొరటాల శివ కాంబోలో తెరకెక్కిన చిత్రం ఆచార్య. కొణిదెల ప్రొడక్షన్స్ బ్యానర్ పై కొణిదెల సురేఖ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇక ఈ సినిమాలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కీలక పాత్రల్లో నటిస్తుండగా.. ఆయనకు జోడిగా పూజా హెగ్డే నటిస్తోంది. కరోనా కారణంగా వాయిదాలు పడుతూ వస్తున్నా ఈ సినిమా ఎట్టకేలకు ఏప్రిల్ 28 న రిలీజ్ కి సిద్ధమైంది. ఇక ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన పాటలు. ట్రైలర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఇక తాజాగా ఈ సినిమా నుంచి మరో సాంగ్ ను విడుదల చేయడానికి మేకర్స్ ముహూర్తం ఖరారు చేశారు. ఈ సాంగ్ కోసం యావత్ మెగా ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నారు. ఎందుకంటే ఈ పాటలో చిరు, చరణ్ ఇద్దరు పోటాపోటీగా డాన్స్ చేయనున్నారు.

భలే భలే బంజారా అంటూ సాగే ఈ సాంగ్ ను తెలుగు టాప్ లిరిసిస్ట్స్ రామ జోగయ్య శాస్త్రి, భాస్కర్ బట్ల, అనంత్ శ్రీరామ్, కళ్యాణ్ చక్రవర్తి రాయడం విశేషం. మణిశర్మ సంగీతం వహిస్తున్న ఈ సాంగ్ కు శేఖర్ మాస్టర్ కొరియోగ్రఫీ చేశారు. ఇక ఈ విషయాన్ని మేకర్స్ ప్రత్యేకంగా తెలిపారు. చిరు, చరణ్, కొరటాల శివ మధ్య జరిగిన సంభాషణను వీడియో ద్వారా తెలిపారు. ఇక వీడియోలో చిరు, చరణ్ డాన్స్ గురించి మాట్లాడుతూ.. రేయ్ చరణ్, ఏమనుకుంటున్నావ్.. నాతో పోటీ పెడతావా నేను నీ బాబుని రా.. నువ్వు రేపు సెట్స్ మీద తగ్గాలి అని చిరు అనడం అందుకు రామ్ చరణ్.. అప్పా నేను ఎట్టి పరిస్థితుల్లోనూ తగ్గను.. నీ నుంచి నేర్చుకున్నా కాబట్టి నీ పేరు చెడగొట్టను అని చెప్పడం.. సరే పద మాటలు ఎందుకు సెట్ లో చూసుకుందాం అని చిరు అనడం ఆకట్టుకున్నాయి. ఇక సాంగ్ ప్రోమోలో కూడా చిరు, చరణ్ ల డాన్స్ పోటాపోటీగా చేసినట్లు కనిపిస్తుంది. దీంతో ఈ సాంగ్ కోసం మెగా అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. కాగా ఈ పాటను ఏప్రిల్ 18న రిలీజ్ చేస్తున్నట్టు తెలిపారు. మరి మెగా ట్రీట్ కు ఫ్యాన్స్ సిద్దంకండి.. ఒకే ఫ్రేమ్ లో తండ్రీకొడుకులు ఆడించే ఆటను చూడడానికి.. అని అభిమానులు కామెంట్స్ పెడుతున్నారు.

Exit mobile version