సూపర్ స్టార్ మహేష్ బాబు మేనల్లుడు అశోక్ గల్లా టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇస్తున్న విషయం తెలిసిందే. అశోక్ మొదటి చిత్రం “హీరో” అనే టైటిల్ తో రూపొందుతోంది. ఈ చిత్రంలోని “అచ్చ తెలుగందమే” సాంగ్ లిరికల్ వీడియోను రానా దగ్గుబాటి ఆవిష్కరించారు. ఈ పాటను యువ సంచలన గాయకుడు సిద్ శ్రీరామ్ పాడారు. తమిళ యువ సంగీత దర్శకుడు జిబ్రాన్ స్వరపరిచారు. “అచ్చ తెలుగందమే” సాంగ్ క్లాసికల్ ట్విస్ట్‌తో కూడిన శ్రావ్యమైన రొమాంటిక్ సాంగ్. ఈ పాటకి రామజోగయ్య శాస్త్రి సాహిత్యం అందించారు. హీరోయిన్ పై హీరో తన ప్రేమను వ్యక్తపరిచే ఈ సాంగ్ లో సాహిత్యం అద్భుతంగా ఉంది.
Read Also : పాకిస్తాన్ కు ఇలాగే చెప్తారా? ఢిల్లీ సీఎంకు ఆర్జీవీ సూటి ప్రశ్న
అశోక్ గల్లా సరసన నిధి అగర్వాల్ హీరోయిన్ గా నటించిన ‘హీరో’ చిత్రానికి శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రంలో ప్రధాన జంటతో పాటు జగపతి బాబు, సత్య, నరేష్, అర్చన సౌందర్య కూడా సహాయక పాత్రల్లో నటిస్తున్నారు. మహేష్ బాబు పెద్ద సోదరి, అశోక్ గల్లా తల్లి పద్మావతి గల్లా అమర రాజా మీడియా & ఎంటర్‌టైన్‌మెంట్ పతాకంపై బ్యానర్ పై ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. సినిమాటోగ్రఫీని సమీర్ రెడ్డి, రిచర్డ్ నిర్వహిస్తున్నారు ప్రసాద్.
