NTV Telugu Site icon

Abhishek Pictures: ఎవడు కొనమన్నాడురా సినిమా.. ఎవరు ఇవ్వాలి డబ్బులు.. ఏకిపారేస్తున్న రౌడీ ఫ్యాన్స్

Wfl

Wfl

Abhishek Pictures: ప్రస్తుతం ఇండస్ట్రీలో ఒక ట్రెండ్ నడుస్తోంది… హిట్ అయితే హీరోకు క్రెడిట్ ఇవ్వాలి.. ప్లాప్ అయితే డైరెక్టర్ మీద తోసెయ్యాలి. ఇది ఎప్పటినుంచో ఇండస్ట్రీలో ఉన్న ఆనవాయితీ అని చెప్పొచ్చు. ఇక ఒక చిన్న హీరో ఎదుగుతున్నాడు అంటే.. అతనిని వెనక్కి లాగడానికి ఎన్నో ప్రయత్నాలు జరుగుతూ ఉంటాయి. ఏదైనా కొత్తగా ఒకటి ప్రయత్నించినప్పుడు మొదట ఏంటి ఇది కొత్తగా అంటారు.. అదే అది సక్సెస్ అయ్యింది అంటే.. ఆ హీరో టార్చ్ బేరర్ రా అని పొగిడేస్తారు. ప్రస్తుతం ఇండస్ట్రీలో విజయ్ దేవరకొండ పరిస్థితి కూడా అలానే ఉంది. ఒక సాధారణ కుర్రాడిగా చిన్న చిన్న పాత్రలు చేస్తూ కెరీర్ ను ప్రారంభించాడు. యాటిట్యూడో.. లేక తన మాటకారితనమో.. ప్రమోషన్స్ స్టంటో పక్కన పెడితే.. ఎంతోకొంతవరకు అభిమానుల్లో తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకున్నాడు. ప్రమోషన్స్ లో విజయ్ చేసే పనులు ఏ హీరో ఇప్పటివరకు చేసింది లేదు. కేవలం సినిమాల విషయంలోనే కాకుండా.. రియల్ లైఫ్ లో కూడా మనోడు తనకు తోచిన సాయం అందించేవాడు.

వరదలు వచ్చినప్పుడు సహాయం చేయడం, కరోనా సమయంలో తనవంతు కష్టపడడం, తన బర్త్ డే కు అభిమానులకు గిఫ్ట్ పంపడం.. సినిమా సక్సెస్ అయ్యినప్పుడు తన పారితోషికంలో నుంచి కొంత డబ్బును అభిమానులకు ఇస్తాను అనడం.. ఇవన్నీ ఇప్పటివరకు ఏ హీరో చేయలేదు. ఇక ఇలా చేస్తున్నందుకు ట్రోలర్స్ విమర్శించడం సాధారణమే .. కానీ, విజయ్ తో సినిమా తీసిన ఒక ప్రొడక్షన్ హౌస్ కూడా ట్రోల్ చేయడం ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

ఇక ఇప్పుడు అంటే హిట్ సినిమాలను అందుకున్న ఈ ప్రొడక్షన్ హౌస్ ఒకప్పుడు ప్లాప్ సినిమాలను డిస్ట్రిబ్యూట్ చేసి నష్టాలను చవిచూసింది. అందులో విజయ్ దేవరకొండ నటించిన వరల్డ్ ఫేమస్ లవర్ ఒకటి. క్రాంతి మాధవ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం 2020 లో రిలీజ్ అయ్యి భారీ డిజాస్టర్ ను అందుకుంది. డిస్ట్రిబ్యూటర్స్ ను నిలువెల్లా ముంచింది. ఇక ఆ విషయాన్నీ మరోసారి ఎత్తిచూపి విజయ్ ను కించపరచాలనుకున్నారు అభిషేక్ పిక్చర్స్. అభిమానులకు కోటి రూపాయలు ఇస్తున్నావ్.. మేము నీ సినిమాను డిస్ట్రిబ్యూట్ చేసి నష్టాలను చూశాం.. ఇప్పటివరకు దానిపై స్పందించింది లేదు అని చెప్పుకొచ్చారు. ” డియర్ విజయ్ దేవరకొండ.. వరల్డ్ ఫేమస్ లవర్ సినిమా పంపిణీలో మేము 8 కోట్లను కోల్పోయాము, కానీ దానిపై ఎవరూ స్పందించలేదు. ఇప్పుడు మీరు మీ పెద్ద మనసుతో కుటుంబాలకు 1CR విరాళం ఇస్తున్నందున, దయచేసి మమ్మల్ని మరియు మా ఎగ్జిబిటర్స్ & డిస్ట్రిబ్యూటర్స్ కుటుంబాలను కాపాడాలని కోరుతూ & ఆశిస్తున్నాము” అని చెప్పుకొచ్చారు.

ఇక దీనిపై సోషల్ మీడియా లో పెద్ద రచ్చ జరుగుతుంది. ప్లాప్ వచ్చిందని డబ్బులు అడుగుతున్నావు.. హిట్ వస్తే డబ్బులు ఇస్తావా.. ? అని కొందరు. ఇదే మాట ఇప్పుడున్న పెద్ద హీరోలను అడిగే దమ్ముందా.. ? అని ఇంకొందరు చెప్పుకొస్తున్నారు. ఎవడు కొనమన్నాడు.. అర్జున్ రెడ్డి సినిమాను మరోమాట లేకుండా ఎంత అంటే అంత కొన్నారు.. అప్పుడు లాభాలు చూశారు. అప్పుడు విజయ్ ను పొగిడారు.. ఇప్పుడు అతనేదో ఫ్యాన్స్ కోసం ఏదైనా చేస్తుంటే.. ఇలా చేయడం పద్దతి కాదు.. అయినా విజయ్ ఏమైనా నిర్మాతనా.. ? మీరు అడిగితె నిర్మాతను అడగాలి..? విజయ్ ను ఎందుకు అడుగుతారు.. ? అంటూ ఏకిపారేస్తున్నారు.. కావాలని కదిలించారు.. బాగా గట్టిగా పెడుతున్నట్టున్నారే అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

Show comments