Site icon NTV Telugu

Fauji : ప్రభాస్ ఫౌజీ మూవీతో.. టాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్న బాలీవుడ్ స్టార్ హీరో

Fouji

Fouji

ప్రజంట్ బాలీవుడ్ టాలీవుడ్ అనే తేడా లేకుండా పోయింది. దాదాపు హిందీ యాక్టర్స్ స్టార్ హీరోలు అంతా తెలుగు చిత్రాలో ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ఇందులో భాగంగా కల్కి 2898 AD లో అమితాబ్ బచ్చన్ అశ్వథ్థామ గా అద్భుతమైన పాత్ర పోషించి ప్రేక్షకులను మెప్పించగా. ఇప్పుడు ఆయన కుమారుడు, బాలీవుడ్ నటుడు అభిషేక్ బచ్చన్ కూడా త్వరలోనే టాలీవుడ్ ఎంట్రీ ఇవ్వబోతున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి.

Also Read : Kalki2898AD : కల్కీ సినిమా నుంచి దీపికా పదుకునే అవుట్..

ఆశ్చర్యం ఏంటంటే, ఆయన తొలి తెలుగు సినిమా కూడా ప్రభాస్ హీరోగా వస్తున్న భారీ ప్రాజెక్ట్‌ కావడం విశేషం. అవును.. నివేదికల ప్రకారం, హను రాఘవపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఫౌజీ సినిమాలో అభిషేక్ బచ్చన్ కీలక పాత్రలో నటించనున్నారని తెలుస్తోంది. స్వాతంత్ర్యానికి ముందు నాటి నేపథ్యంలో సాగే  ఈ ప్రేమ కథ చిత్రం, ఇప్పటికే షూటింగ్‌లో బిజీగా ఉంది. కాగా కథలో ఒక పాత్రకు అభిషేక్ సరైన ఎంపిక అవుతారని మేకర్స్ భావించి ఆయనను సంప్రదించారని సమాచారం.

అభిషేక్‌కు కథ నచ్చడంతో పాటు, పాత్రపై కూడా ఆసక్తి చూపినట్టు తెలిస్తోంది. కాగా ప్రస్తుతం చిత్ర యూటిట్ ఆయనతో కమర్షియల్ డిస్కషన్స్ జరుపుతోందని త్వరలోనే అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉందని టాక్. ఇప్పటివరకు బాలీవుడ్‌లోనే తన కెరీర్‌ను కొనసాగించిన అభిషేక్, ఈ అవకాశంతో దక్షిణాదికి అడుగుపెడితే, ఆయనకు తెలుగు మార్కెట్‌తో పాటు హిందీ వర్షన్ ద్వారానూ పెద్ద స్థాయి గుర్తింపు దక్కే అవకాశం ఉంది. ఇక ప్రభాస్-హను రాఘవపూడి కాంబినేషన్‌లో వస్తున్న ఫౌజీ ప్రాజెక్ట్‌పై ప్రేక్షకుల్లో ముందు నుండి భారీ అంచనాలు ఉన్నాయి. ఈ సినిమాలో అభిషేక్ బచ్చన్ ఎంట్రీ నిజమైతే, సినిమాపై హైప్ మరింత పెరగడం ఖాయం. అభిమానులు మాత్రం అధికారిక ప్రకటన కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

Exit mobile version