Site icon NTV Telugu

ఇంటిని అమ్మేసిన స్టార్ హీరో…!?

Abhishek Bachchan sold his luxury apartment

బాలీవుడ్ హీరో అభిషేక్ బచ్చన్ తన ఇంటిని విక్రయించడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. అభిషేక్ బచ్చన్ ముంబైలో తన లగ్జరీ అపార్ట్‌మెంట్‌ను విక్రయించారు. బి టౌన్ వార్తల ప్రకారం అభిషేక్ బచ్చన్ తన పాత అపార్ట్‌మెంట్‌లలో ఒకదాన్ని రూ .45.75 కోట్లకు విక్రయించారు. నిజానికి అభిషేక్, అతని కుటుంబ సభ్యులు ఎవరూ ఈ అపార్ట్‌మెంట్‌లో నివసించలేదు. నటుడు తన భార్య ఐశ్వర్యరాయ్ బచ్చన్, కుమార్తె ఆరాధ్య బచ్చన్‌తో కలిసి ముంబైలోని బచ్చన్ కుటుంబానికి చెందిన “జల్సా”లో నివసిస్తున్నారు. అభిషేక్ బచ్చన్ ఈ ఇల్లు ‘ఒబెరాయ్ 360’లో 37వ అంతస్తులో ఉంది. ఈ ఇంటిని అభిషేక్ బచ్చన్ 2014 లో రూ .41 కోట్లకు కొనుగోలు చేశారు. ప్రత్యేక విషయం ఏమిటంటే అక్షయ్ కుమార్, షాహిద్ కపూర్‌లకు కూడా ఈ భవనంలో అపార్ట్‌మెంట్‌లు ఉన్నాయి. అయితే అభిషేక్ ఈ ఇంటిని ఎందుకు విక్రయించాడో తెలియలేదు. ఈ ఏడాది మేలో అమితాబ్ బచ్చన్ డూప్లెక్స్ అపార్ట్‌మెంట్ కొనుగోలు చేశారు. అంధేరిలో కొనుగోలు చేసిన ఈ ఇంటి విలువ 31 కోట్లు అని వార్తలు విన్పించాయి.

Read Also : గోవాలో ఫైట్ చేస్తున్న మహేశ్ బాబు!

మరోవైపు అభిషేక్ బచ్చన్ చివరిగా ‘ది బిగ్ బుల్’ చిత్రంలో కనిపించాడు. స్టాక్ బ్రోకర్ హర్షద్ మెహతా జీవితం ఆధారంగా తెరకెక్కిన ఈ చిత్రానికి అభిషేక్ బచ్చన్ ప్రశంసలు అందుకున్నారు. ఇప్పుడు అభిషేక్ బచ్చన్ నిమ్రత్ కౌర్‌తో ‘దాస్వి’ చిత్రంలో, చిత్రాంగద సేన్‌తో ‘బాబ్ బిశ్వాస్’ చిత్రంలో కనిపించనున్నారు.

Exit mobile version