Site icon NTV Telugu

ఆ అవమానాలను తట్టుకోలేకపోయాను.. కానీ,

abhishek bachhan

abhishek bachhan

బాలీవుడ్ సూపర్ స్టార్ కొడుకు.. ఎక్కడికి వెళ్లిన ఆయనకంటూ ఒక ప్రత్యేకస్థానం ఉంటుంది.. ఆయన సినిమాలు ఒక రేంజ్ లో హిట్ అవుతాయి.. అవకాశాలు వెల్లువెత్తుతాయి అని అనుకున్నారు కానీ, ఆ స్టార్ కొడుకు అప్పుడే కాదు ఇప్పటికి అవమానాలు ఎదుర్కొంటున్నా అని అతను చెప్పడం బాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది. ఇంతకీ ఆ స్టార్ హీరో కొడుకు ఎవరు అంటే బాలీవుడ్ బిగ్ బి వారసుడు అభిషేక్ బచ్చన్..

https://ntvtelugu.com/manchu-lakshmi-injured-photoes-in-social-media/

ఇటీవల ఒక ఇంటర్వ్యూ లో పాల్గొన్న అతను తానూ పడ్డ అవమానాలను ఏకరువు పెట్టాడు.. ” నాకు జరిగిన అవమానాలను అన్ని వృత్తిలో భాగంగానే స్వీకరించాను. కొన్ని సార్లు ఆ అవమానాలను తట్టుకోవడం నా వల్ల అయ్యేది కాదు. చాలా సందర్భాల్లో నన్ను నాకు చెప్పకుండానే సినిమాల్లో నుంచితీసేసారు.. షూటింగ్ కానీ వెళ్తే అక్కడ నా ప్లేస్ లో మరొకరు ఉండేవారు.. ఇంకొన్ని సందర్భాల్లో ఫంక్షన్ కి పిలుస్తారు.. వెళ్లి మొదటి సీట్ లో కూర్చొంటే.. వేరెవరో పెద్ద గెస్ట్ వస్తే నన్ను పక్కకి వెళ్లమనేవారు. ఇలాంటివి నా జీవితంలో చాలా జరిగాయి . కొన్ని సార్లు ఈ అవమానాలు తట్టుకోలేక ఏడుపు వచ్చేది .. అయినా ఇదంతా నా వృత్తిలో భాగమే అని సర్దిపెట్టుకున్నాను.  నటుడిగా మరింత ఎత్తుకు ఎదిగి ఇలాంటి అవమానాలు జరక్కుండా చూసుకోవాలని ప్రతిజ్ఞ చేయడం తప్ప ఇంకేముంటుంది” అని తన బాధని వెల్లగక్కాడు అభిషేక్. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు నెట్టింట వైరల్ గా మారింది.

Exit mobile version