NTV Telugu Site icon

Aishwarya: ఐశ్వర్యను ఒంటరిగా వదిలివేసి.. ఆమె పక్కన కూర్చున్న అభిషేక్?

Abhishek Bachchan Aishwarya

Abhishek Bachchan Aishwarya

Aishwarya: కొన్ని నెలలుగా బి-టౌన్‌లో నటి ఐశ్వర్యారాయ్- అభిషేక్ బచ్చన్‌ల విడాకుల వార్త హాట్ టాపిక్ అవుతుంది. అభిషేక్ బచ్చన్ తన పెళ్లి ఉంగరం ధరించకుండా ఓ ఈవెంట్‌లో కనిపించడమే ఈ ఊహాగానాలన్నింటికీ కారణం. ఆ తర్వాత జరిగిన సంఘటనలు ఒక్కొక్కటిగా సినిమాటిక్‌గా సాగగా అవన్నీ అనుమానాలు మరింత పెంచే లాగానే ఉన్నాయి. అక్కడి నుంచి మొదలైన ఐష్-అభిషేక్ బచ్చన్ల విడాకుల వార్తలు ఇంకా చల్లారలేదు. ఎందుకంటే బచ్చన్ కుటుంబం ఈ వార్తలను చల్లార్చడం లేదు. వీరిద్దరి విడాకుల వ్యవహారం చల్లారిపోతోందని అనిపించడం లేదు. కొన్ని నెలలుగా బచ్చన్ ఫ్యామిలీలో ఈ విడాకుల ఆట సాగుతోంది. ఇందులో బిగ్ బి అమితాబ్ కూడా ఓ పాత్ర పోషిస్తున్నాడు.

Also Read: Guess The Celebrity: ఈ చిన్నారి ఇప్పుడు ఓ స్టార్ హీరోయిన్.. ఎవరో చెప్పుకోండి చూద్దాం

గతంలో కూడా ఈ ఫ్యామిలీకి పబ్లిసిటీ అంటే పిచ్చి అని నెటిజన్లు చెప్పుకునేవారు. పెళ్లి అనే సంబంధాన్ని ఇలా వాడుకుంటున్నారంటూ ట్రోలింగ్ కూడా ఎక్కువైంది. కానీ, ఇప్పుడు వచ్చిన కొత్త వార్త ఏంటంటే.. వీరి రిలేషన్ బ్రేకప్ కావడానికి నటి నిమ్రత్ కౌర్ నే కారణం. దస్వీ సినిమా షూటింగ్ సమయంలోనే అభిషేక్ తో ఆమె ప్రేమ మొదలైందని అంటున్నారు. ఐష్, అభిల పెళ్లి బ్రేకప్ అవ్వడానికి ఆమె కారణమని కూడా అంటున్నారు. అయితే ఇప్పటి వరకు అభిషేక్ బచ్చన్ కానీ, ఐశ్వర్యారాయ్ కానీ, ఆరోపణలు ఎదుర్కొంటున్న నిమ్రత్ కౌర్ కానీ ఈ అంశం మీద స్పందించలేదు. అయితే ఈ క్రమంలో పాత వీడియో ఒకటి సంచలనంగా మారింది..కపిల్ శర్మ షోకి అభిషేక్ బచ్చన్ మరియు నిమృత్ కౌర్ వచ్చారు. మొదట్లో ఇద్దరూ ఒకరి మీద ఒకరు ఫిర్యాదులు చేసుకున్నారు. అయితే మాట్లాడుకుంటూ మాట్లాడుకుంటూ నిమృత్ దగ్గరకు వచ్చి జోకులు వేశాడు అభిషేక్. అది విని నిమృత్ పెద్దగా నవ్వింది.

Also Read: Pushpa 2 : పుష్ప-2 నుంచి కొత్త పోస్టర్ రిలీజ్

ఇది చూసి అక్కడే ఉన్న కపిల్ శర్మ కూడా ఒక్క క్షణం షాక్ అయ్యాడు. మరోవైపు ఐశ్వర్యరాయ్, అభిషేక్ ఓ ఈవెంట్‌కి వెళ్లారు. అభిషేక్ దంపతులు ఫోటో దిగుతుండగా ఏం జరిగిందో తెలియ లేదు. ఐశ్వర్య అభిషేక్ ను స్టేజ్‌పైనే సగం వదిలి వెళ్లిపోయింది. ఐశ్వర్యను తన భర్తను పిలుస్తున్నప్పటికీ కోపంగా వెళ్తున్నట్టు కనిపిస్తోంది. ఐశ్వర్యరాయ్ చాలా బాధలో ఉన్నా కెమెరా ముందు చూపించకుండా చిరునవ్వుతో నటించడం ఈ వీడియోలో స్పష్టంగా కనిపిస్తుంది. ఈ రెండు వీడియోలను కలిపి వైరల్ చేస్తున్నారు నెటిజన్లు. ఐశ్వర్య ఒంటరిగా మిగిలిపోతే, అభిషేక్ చాలా సంతోషంగా వచ్చి నిమృత్ పక్కన కూర్చున్నాడు. అభిషేక్, ఐశ్వర్యల మధ్య బ్రేకప్ దాదాపుగా ఫిక్స్ అయినట్లే. ఇక ఈ వార్తలను కొట్టిపారేస్తూ.. ఎక్కడెక్కడో ఈ జంట కలిసి కనిపిస్తున్నప్పటికీ ప్రస్తుతం జరుగుతున్న పలు సంఘటనలు చూస్తుంటే ఈ జంట విడిపోవడం ఖాయం అని అంటున్నారు.

Show comments