అమితాబ్ వారసుడిగా కెరీర్ స్టార్ట్ చేసిన అభిషేక్ ఫాదర్‌లా మ్యాజిక్ చూపించడంలో తడబడ్డాడు. లెగసీని కంటిన్యూ చేయగలిగాడు కానీ లెజెండరీ యాక్టర్‌ను మైమరిపించలేకపోయాడు. సుమారు 70 సినిమాలు చేసినప్పటికీ ఫింగర్ టిప్స్‌పై లెక్కగట్టగలిగే విజయాలే ఉన్నాయి. మధ్య మధ్యలో మల్టీస్టారర్ చిత్రాలతో నెట్టుకు వచ్చాడు. కానీ సోలో హీరోగా వచ్చిన చిత్రాలు ఫెయిల్యూరై కెరీర్‌ను డైలామాలో పడేశాయి. తనకు మార్కెట్ లేదని త్వరగానే గ్రహించిన చోటా బీ మెల్లిగా ఏజ్‌కు తగ్గ క్యారెక్టర్లకు స్విచ్చాన్ అయి వర్సటైల్ రోల్స్ వైపు కాన్సట్రేషన్ చేస్తున్నాడు.
Also Read : KUSHITHA : నాజూకైన సొగసులతో అందాల కనువిందు చేస్తున్న ‘కుషిత’
థియేటర్లకు జనాలను రప్పించడంలో ఫెయిల్యూరైన అభిషేక్ ఓటీటీలో మాత్రం సక్సెస్ అవుతున్నాడు. రొటిన్ రొడ్డకొట్టుడు చిత్రాలను కాదని డిఫరెంట్ స్టోరీలతో డిజిటల్ ప్రేక్షకుల మనస్సు దోచేస్తున్నాడు. ఫాదర్ రోల్స్ చేసిన బ్రీత్ ఇన్ టూ ద షాడోస్, బీ హ్యాపీ చిత్రాలు మంచి వ్యూస్ దక్కించుకున్నాయి. కానీ ఐ వాంట్ టు టాక్ మాత్రం థియేటర్లలో మెప్పించలేకపోయింది. ఈ మధ్యలో హౌస్ ఫుల్ 5లో వన్ ఆఫ్ ది హీరోగా కనిపించినప్పటికీ క్రెడిట్ అక్షయ్ ఖాతాలో చేరిపోయింది. గతంతో పోల్చుకుంటే స్క్రిప్ట్ సెలక్షన్‌లో సక్సెస్ అవుతున్నాడు అభిషేక్. ఓటీటీ, థియేటరా అనేది పట్టించుకోవడం లేదు. ఈ నేపధ్యంలో 2019లో తమిళంలో వచ్చిన కేడీని రీమేక్ చేస్తున్నాడు. ‘కాలిదార్ లాపతా’ జీ5లో జులై 4న స్ట్రీమింగ్ కానుంది. ఇందులో ఓల్డ్ ఏజ్ క్యారెక్టర్ పోషిస్తున్నాడు అభిసేక్. అలాగే నెక్ట్స్ షారూఖ్ ఖాన్ కింగ్‌లో నెగిటివ్ రోల్ చేస్తున్నట్లు టాక్. అలాగే రాజా శివాజీలో కూడా కీ రోల్ ప్లే చేస్తున్నాడని తెలుస్తోంది. కెరీర్ డ్యామేజ్ అవుతున్న టైంలో యూటర్న్ తీసుకుని లైమ్ లైట్లో అందులోనూ మెయిన్ లీడ్స్ చేస్తోన్న అభిషేక్ బ్యాక్ టు బ్యాక్ హిట్స్ తో రేస్ లో దూసుకెళ్తున్నాడు.
