Site icon NTV Telugu

ఆసుపత్రిలో చేరిన అభిషేక్ బచ్చన్

బాలీవుడ్ నటుడు అభిషేక్ బచ్చన్ సినిమా షూటింగ్ లో గాయపడి మూడు రోజులు అవుతోంది. ఈ ప్రమాదాల్లో ఆయన చేతికి ఫ్రాక్చర్ అయింది. ఆయన ముంబైలోని లీలావతి ఆసుపత్రిలో చికిత్స పొంది ఆరోజే డిశార్చ్ అయ్యారు. అయితే గాయ పరిస్థితిపై తిరిగి మరోసారి ఆయన ఆసుపత్రికి వెళ్లినట్లు తెలుస్తోంది. చికిత్స అనంతరం కొన్ని రోజులు విశ్రాంతి తీసుకోవాలని వైద్యులు సూచించారు. ఆయనను చూసేందుకు తండ్రి అమితాబ్ బచ్చన్, సోదరి శ్వేత బచ్చన్ ఆసుపత్రికి వెళ్లారు. అయితే అభిషేక్ కు గాయాలైనట్టు వస్తున్న వార్తలపై ఆయన కుటుంబం గాని, చిత్రయూనిట్ గాని స్పందించకపోవడంతో ఫేక్ న్యూస్ గా భావించారు. కాగా, అభిషేక్ ఆసుపత్రికి వెళ్తున్న ఫోటోలు బయటకి రావటంతో నిర్దారణ అయింది. ‘బాబ్ విశ్వాస్’ సినిమా షూటింగ్ సమయంలో ఈ ప్రమాదం చోటుచేసుకోంది.

Exit mobile version