ఆకట్టుకుంటున్న అభిషేక్ ‘బాబ్ బిస్వాస్’ ట్రైలర్…
- Follow Us :
-
-
Add as a preferred
source on google
2000లో ‘రెఫ్యూజీ’తో ఎంట్రీ ఇచ్చిన అభిషేక్ బచ్చన్ ప్రస్తుతం నటుడుగా పేరు తెచ్చే సినిమాలపై ఫోకస్ పెట్టాడు. ‘మన్ మర్జియాన్’, ‘లూడో’, ‘ద బిగ్ బుల్’ వంటి సినిమాలలో పాత్రలతో ఆకట్టుకున్న అభిషేక్ ఇప్పుడు ‘బాబ్ బిస్వాస్’ పేరుతో ఆసక్తికరమైన మూవీ చేస్తున్నాడు. షారూఖ్ ‘రెడ్ చిల్లీస్’ బ్యానర్ దియా అన్నపూర్ణ ఘోష్ దర్శకత్వంలో తీస్తున్న ఈ సినిమా ట్రైలర్ విడుదలైంది. ఈ బాబ్ బిస్వాస్ 2012లో విడుదలైన ‘కహానీ’ సినిమాలో పాత్ర. నిజానికి కహానిలో ఆ పాత్రను శావ్వత ఛటర్జీ పోషించారు. సుజయ్ ఘోష్ ఆ చిత్రానికి దర్శకుడు. అతడు ఆ పాత్రపై స్విన్ ఆఫ్ ఫిల్మ్ తీయాలనుకున్నాడు.
అయితే ఇప్పుడు అతని కూతురు దియా దర్శకత్వంలో ‘బాబ్ బిస్వాస్’ రూపొందింది. కథను మాత్రం సుజయ్ ఘోష్ అందించారు. ఈ సినిమా డిజిటల్ ప్లాట్ ఫామ్ జీ5లో డిసెంబర్ 3న స్ట్రీమింగ్ కాబోతోంది. ఈ సినిమా నుంచి విడుదలైన ట్రైలర్, అందులో అభిషేక్ లుక్ అందరినీ ఆకట్టుకుంటోంది. బాబ్ నేపథ్యం, అతను కాంట్రాక్ట్ కిల్లర్ గా మారటానికి దారితీసిన పరిస్థితులను ఇందులో చూడబోతున్నట్లు ట్రైలర్ చూడగానే అర్థం అవుతుంది. చిత్రాంగద సింగ్, రోనిత్ ఆరోరా, పరాన బందోపాధ్యాయ, టినా దేశాయ్ ముఖ్య పాత్రలు పోషిస్తున్న ఈ సినిమాకు క్లింటన్ సెరిజో, బియాన్స్ గోమ్స్ సంగీతం అందించారు. గౌరీఖాన్, సుజయ్ ఘోష్, గౌరవ్ వర్మ నిర్మాతలు.
Also Read
- Vijay - Rashmika: "బీచ్‌లో నిక్కరేసుకుని తాళి కడదామనుకున్నా" .. రౌడీ హీరో విజయ్ వెడ్డింగ్ ప్లాన్‌పై ఇంట్లో సీన్ సితార!
- Vijay Deverakonda: క్యారెక్టర్ కోసం ఇంత రిస్కా? 'రణబాలి' సెట్లో చావు అంచుల దాకా వెళ్లిన విజయ్ దేవరకొండ!
- Adarsha Kutumbam: రూ.300 కోట్ల హీరో.. తోపు డైరెక్టర్.. అయినా 'ఆదర్శ కుటుంబం'పై ఇంత సైలెన్స్ ఏంటి?
- The Paradise OTT: సిల్వర్ స్క్రీన్‌పై 'ది ప్యారడైజ్'లో మిస్సయిన ఆ పాట.. నెట్‌ఫ్లిక్స్ కోసం శ్రీకాంత్ ఓదెల మాస్టర్ స్కెచ్!
తాజావార్తలు
-
Vijay – Rashmika: “బీచ్‌లో నిక్కరేసుకుని తాళి కడదామనుకున్నా” .. రౌడీ హీరో విజయ్ వెడ్డింగ్ ప్లాన్‌పై ఇంట్లో సీన్ సితార!
-
Manchu Manoj: మంచు మనోజ్ ఎమోషనల్ పోస్ట్.. భార్య మౌనిక కోసమే ఆ అడుగు!
-
AP Govt: రేపు ఏపీలో ‘అమరజీవి జలధార’కు శ్రీకారం.. 27.36 లక్షల కొత్త కుళాయి కనెక్షన్లు..
-
Rishab Shetty vs Homble Films :ముదిరిన రిషబ్ VS హోంబలే వివాదం?
-
Zomato Delivery Boy : జొమాటో బాయ్‌పై దంపతుల దాడి.. కార్ఖానా పోలీస్ స్టేషన్ వద్ద ఉద్రిక్తత..
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!