Abdul Kalam Biopic into Cards again: ఇస్రో సైంటిస్ట్ గా కెరీర్ ప్రారంభించి ఏకంగా రాష్ట్రపతి అయ్యేవరకు డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం జీవితం ఎంతో స్ఫూర్తిదాయకం. చిన్న స్థాయిలో ఉన్నవారు కూడా అవినీతికి అలవాటు పడి కోట్లకు కోట్లు సంపాదిస్తున్న ఈ రోజుల్లో ఆయన చనిపోయే నాటికి కొన్ని పుస్తకాలు, రెండు జతలు బట్టలు తప్ప ఆయన పేరు మీద ఎలాంటి ఆస్తులు కూడా లేవు అంటే ఆయన వ్యక్తిత్వం ఏమిటో అర్థం అవుతుంది. ఆయన జీవిత కథను ఆధారంగా చేసుకుని కొన్ని సినిమాలు ఇప్పటికే వచ్చాయి.
Nani: ఏపీ ఎలక్షన్స్.. కన్ఫ్యూజన్లో నేచురల్ స్టార్?
అయామ్ కలాం, డ్రీమ్స్, వంటి సినిమాలు వచ్చి ప్రేక్షకులను అలరించాయి. అయితే కొన్నాళ్ల క్రితం ఏకే ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ మీద అనిల్ సుంకర అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ బ్యానర్ మీద అభిషేక అగర్వాల్ సంయుక్తంగా ఒక బయోపిక్ చేస్తున్నట్లు అధికారికంగా ప్రకటన చేశారు. ఈ ప్రకటన వచ్చి కొన్నేళ్ళు అయిపోయింది కానీ సినిమా ముందుకు వెళ్లలేదు. అయితే ఇప్పుడు అనూహ్యంగా ఈ సినిమా మొదలుపెట్టడానికి అభిషేక్ అగర్వాల్ రంగంలోకి దిగినట్లు తెలుస్తోంది. తెలుగు, హిందీ భాషల్లో ఉన్న టాప్ నటీనటులతో ఈ సినిమాని పట్టాలెక్కించే ప్రయత్నం చేస్తున్నట్లు చెబుతున్నారు. తెలుగు హిందీ బైలింగ్వెల్ ప్రాజెక్టుగా సినిమాని తరికెక్కించి, అవకాశాన్ని బట్టి తమిళ, కన్నడ, మలయాళ భాషల్లోకి సైతం డబ్బింగ్ చేసేలా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. అయితే ఈ ప్రాజెక్టులో అనిల్ సుంకర అండ్ టీం భాగం అవుతుందా? లేదా? అనే విషయం మీద మాత్రం క్లారిటీ లేదు.