Abhaya: 4 భాషల్లో ‘అభయ’.. టైటిల్ పోస్టర్ అవుట్!

Abhay

Abhay

సమాజంలో మహిళల శక్తిని, వారి పట్టుదలను వెండితెరపై ఆవిష్కరిస్తూ సరికొత్త లేడీ ఓరియంటెడ్ పాన్ ఇండియా చిత్రం సిద్ధమవుతోంది. యోగిత భోసాలె ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ వినూత్న చిత్రానికి ‘అభయ’ అనే పవర్‌ఫుల్ టైటిల్‌ను ఖరారు చేశారు. ఎన్ఎస్ఇ లిస్టింగ్ మీడియా అండ్ ఎంటర్‌టైన్‌మెంట్ సంస్థ ‘గ్రాడియెంటే ఇన్ఫోటైన్‌మెంట్ లిమిటెడ్’ అధినేత డా. విమల్ రాజ్ మాథుర్, ‘ఆర్‌.డి.జి ప్రొడక్షన్ ప్రైవేట్ లిమిటెడ్’ అధినేత శ్రీ రూపేష్ డి. గోహిల్ సంయుక్తంగా ఈ భారీ ప్రాజెక్ట్‌ను నిర్మిస్తున్నారు. ప్రముఖ దర్శకుడు యూసఫ్ ముజామ్మిల్ సుర్తి కథ, స్క్రీన్ ప్లే అందిస్తూ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన టైటిల్ పోస్టర్‌ను మేకర్స్ గ్రాండ్‌గా విడుదల చేశారు.

తాజాగా విడుదలైన ‘అభయ’ టైటిల్ పోస్టర్ చూస్తుంటేనే ఇదొక పక్కా ఇంటెన్స్ అండ్ పవర్‌ఫుల్ ఉమెన్ ఎంపవర్‌మెంట్ (మహిళా సాధికారత) మూవీ అని స్పష్టమవుతోంది. కమర్షియల్ ఎలిమెంట్స్‌తో పాటు సమాజానికి ఒక బలమైన సందేశాన్ని ఇచ్చేలా దర్శకుడు ఈ కథను మలిచారు. ఈ చిత్రం తెలుగుతో పాటు హిందీ, మరాఠీ, తమిళ భాషల్లో ఏకకాలంలో పాన్ ఇండియా లెవెల్లో విడుదల కాబోతోంది. ఈ సందర్భంగా నిర్మాత డా. విమల్ రాజ్ మాథుర్ మాట్లాడుతూ.. “‘అభయ’ కేవలం ఒక సినిమా మాత్రమే కాదు.. సమాజంలో మార్పును ఆశించే ఒక బలమైన సందేశం. తరతరాలుగా ఎందరికో ప్రేరణగా నిలుస్తున్న మహిళల అసాధారణ శక్తిని, పట్టుదలను ఈ చిత్రం ద్వారా సెలబ్రేట్ చేసుకోబోతున్నాం. నాలుగు భాషల్లో రాబోతున్న ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల చేయడం చాలా ఆనందంగా ఉంది” అని పేర్కొన్నారు.

×
×
Ad