Abhaya: 4 భాషల్లో ‘అభయ’.. టైటిల్ పోస్టర్ అవుట్!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సమాజంలో మహిళల శక్తిని, వారి పట్టుదలను వెండితెరపై ఆవిష్కరిస్తూ సరికొత్త లేడీ ఓరియంటెడ్ పాన్ ఇండియా చిత్రం సిద్ధమవుతోంది. యోగిత భోసాలె ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ వినూత్న చిత్రానికి ‘అభయ’ అనే పవర్ఫుల్ టైటిల్‌ను ఖరారు చేశారు. ఎన్ఎస్ఇ లిస్టింగ్ మీడియా అండ్ ఎంటర్టైన్మెంట్ సంస్థ ‘గ్రాడియెంటే ఇన్ఫోటైన్మెంట్ లిమిటెడ్’ అధినేత డా. విమల్ రాజ్ మాథుర్, ‘ఆర్.డి.జి ప్రొడక్షన్ ప్రైవేట్ లిమిటెడ్’ అధినేత శ్రీ రూపేష్ డి. గోహిల్ సంయుక్తంగా ఈ భారీ ప్రాజెక్ట్‌ను నిర్మిస్తున్నారు. ప్రముఖ దర్శకుడు యూసఫ్ ముజామ్మిల్ సుర్తి కథ, స్క్రీన్ ప్లే అందిస్తూ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన టైటిల్ పోస్టర్‌ను మేకర్స్ గ్రాండ్‌గా విడుదల చేశారు.
తాజాగా విడుదలైన ‘అభయ’ టైటిల్ పోస్టర్ చూస్తుంటేనే ఇదొక పక్కా ఇంటెన్స్ అండ్ పవర్ఫుల్ ఉమెన్ ఎంపవర్మెంట్ (మహిళా సాధికారత) మూవీ అని స్పష్టమవుతోంది. కమర్షియల్ ఎలిమెంట్స్‌తో పాటు సమాజానికి ఒక బలమైన సందేశాన్ని ఇచ్చేలా దర్శకుడు ఈ కథను మలిచారు. ఈ చిత్రం తెలుగుతో పాటు హిందీ, మరాఠీ, తమిళ భాషల్లో ఏకకాలంలో పాన్ ఇండియా లెవెల్లో విడుదల కాబోతోంది. ఈ సందర్భంగా నిర్మాత డా. విమల్ రాజ్ మాథుర్ మాట్లాడుతూ.. “‘అభయ’ కేవలం ఒక సినిమా మాత్రమే కాదు.. సమాజంలో మార్పును ఆశించే ఒక బలమైన సందేశం. తరతరాలుగా ఎందరికో ప్రేరణగా నిలుస్తున్న మహిళల అసాధారణ శక్తిని, పట్టుదలను ఈ చిత్రం ద్వారా సెలబ్రేట్ చేసుకోబోతున్నాం. నాలుగు భాషల్లో రాబోతున్న ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల చేయడం చాలా ఆనందంగా ఉంది” అని పేర్కొన్నారు.
Also Read
- Manchu Vishnu: డీప్‌ఫేక్, పెయిడ్ ట్రోలింగ్‌పై ‘మా’ అధ్యక్షుడు విష్ణు మంచు సంచలన వ్యాఖ్యలు
- Tollywood Release Dates: ఆగం చేస్తున్న పెద్ద సినిమాల రిలీజ్ డేట్లు.. బలవుతున్న చిన్న చిత్రాలు!
- Naga Vamsi: "నా దగ్గర అంత సీన్ లేదు.. డబ్బులిచ్చి వ్యూస్ కొనలేదు" సాంగ్ రికార్డులపై నాగవంశీ కామెంట్స్!
- Naga Vamsi: మీకు భయపడే సినిమా రిలీజ్ ఆపాం.. నాగవంశీ ఓపెన్ కామెంట్స్!
తాజావార్తలు
-
High-Protein Black Chana Soup: రాత్రిపూట తేలికైన, పౌష్టికమైన డిన్నర్.. నల్ల శనగల హై-ప్రోటీన్ సూప్ ట్రై చేయండి
-
Manchu Vishnu: డీప్‌ఫేక్, పెయిడ్ ట్రోలింగ్‌పై ‘మా’ అధ్యక్షుడు విష్ణు మంచు సంచలన వ్యాఖ్యలు
-
Homemade Natural Lip Balm: ఖరీదైన లిప్ బామ్‌లకు చెక్.. ఇంట్లో ఉండే పదార్థాలతోనే సహజమైన లిప్ బామ్ రెడీ..!
-
UP: 8 మంది రాజ్యసభ అభ్యర్థుల్ని ప్రకటించిన బీజేపీ.. కేంద్రమంత్రి హర్దీప్ పూరీకి దక్కని అవకాశం
-
How To Grow Mint Plant: ఒక్క పుదీనా కాడతో మొక్క పెంచేయొచ్చు.. ఈ సింపుల్ టిప్స్ పాటించండి
ట్రెండింగ్
-
Chitti Punugulu: బయట కరకరలాడుతూ, లోపల దూదిలా ఉండే హోటల్ స్టైల్ “చిట్టి పునుగులు”.. ఇంట్లోనే పర్ఫెక్ట్ గా చేయండి ఇలా.!
-
Homemade Peanut Oil: మెషిన్ అవసరం లేదు.. ఇంట్లోనే పల్లీలతో 100% స్వచ్ఛమైన వేరుశెనగ నూనెను తీయండిలా..
-
Rose Plant: గులాబీ కొమ్మను ఇలా నాటితే చాలు.. ఇంట్లోనే కొత్త మొక్క పెంచుకోవచ్చు.. కానీ..
-
Local Body Elections: స్థానిక ఎన్నికలపై సుప్రీం కోర్టు తలుపు తట్టిన వైఎస్సార్సీపీ.. డిమాండ్ ఏంటంటే.?
-
5000 నిట్స్ డిస్ప్లే, 9,020mAh బ్యాటరీ, IP69 రేటింగ్‌తో Vivo Y600k Turbo లాంచ్..!