Aasman : శ్రీహరి కొడుకు హీరోగా ‘ఆస్మాన్’ మూవీ ప్రారంభం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
శ్రీ క్లీంకార సెల్యూలాయిడ్స్ ప్రొడక్షన్ నెంబర్ వన్‌గా ‘ఆస్మాన్’ మూవీని కొండారు వెంకటేష్, శ్రీకాంత్ మన్నెం నిర్మిస్తున్నారు. మేఘాంశ్ శ్రీహరి హీరోగా రానున్న ఈ చిత్రానికి రామ్ నందన్ దర్శకత్వం వహించనున్నారు. ఈ నూతన చిత్ర ప్రారంభోత్సవాన్ని శనివారం నాడు ఘనంగా నిర్వహించారు. ఈ పూజా కార్యక్రమానికి సాయి దుర్గ తేజ్, సందీప్ కిషన్, విశ్వక్ సేన్, నిహారిక కొణిదెల, రోషన్ కనకాల, తిరువీర్, నార్నే నితిన్, రామ్ తాళ్లూరి తదితరులు ముఖ్య అతిథులుగా విచ్చేశారు. ముహూర్తపు సన్నివేశానికి సాయి దుర్గ తేజ్ క్లాప్ కొట్టగా, సందీప్ కిషన్ స్విచ్ ఆన్ చేశారు. నిహారిక కొణిదెల స్క్రిప్ట్‌ని అందించగా.. తొలి సన్నివేశానికి రామ్ నందన్ దర్శకత్వం వహించారు.
Also Read:SRH: సన్ రైజర్స్ హైదరాబాద్‌కు బిగ్ షాక్.. ఇంటికెళ్లిపోయిన స్టార్ ప్లేయర్..
Also Read
ఇక ఈ చిత్ర ప్రారంభోత్సవంలో..మేఘాంశ్ శ్రీహరి మాట్లాడుతూ.. ‘నా ‘ఆస్మాన్’ సినిమా ప్రారంభోత్సవంకి వచ్చిన సాయి అన్నకి, నిహారిక అక్కకి, సందీప్ అన్నకి అందరికీ థాంక్స్. నిర్మాతలు వెంకటేష్, శ్రీకాంత్ గార్లతో పని చేయడం ఆనందంగా ఉంది. రామ్ నందన్ ఓ అద్భుతమైన కథను చెప్పారు. మేం బ్లాక్ బస్టర్ కొట్టబోతోన్నాం. మిగిలిన వివరాలు మున్ముందు ప్రకటిస్తామ’ని అన్నారు. డైరెక్టర్ రామ్ నందన్ మాట్లాడుతూ.. ‘తెలుగులో నాకు ‘ఆస్మాన్’ తొలి అవకాశం. నన్ను నమ్మి అవకాశం ఇచ్చిన నిర్మాత వెంకటేష్ గారు, శ్రీకాంత్ గార్లకు థాంక్స్. మేఘాంశ్‌తో కలిసి పని చేయడం ఆనందంగా ఉంది. మూడు షెడ్యూల్స్‌లో సినిమాని పూర్తి చేస్తాం. సీట్ ఎడ్జ్ థ్రిల్లర్‌తో రాబోతోన్నాం. ఇది చాలా కొత్తగా ఉంటుంది’ అని అన్నారు.
తాజావార్తలు
-
Telangana Civil Supplies : రైస్ మిల్లర్లకు తెలంగాణ సర్కార్ వార్నింగ్.. ఆస్తులు జప్తే
-
CJP Protest: కాక్రోచ్‌లపై ముంబై పోలీసుల యాక్షన్.. నిర్వాహకులతో పాటు 400-500 మందిపై కేసు
-
Producers Council : మళ్లీ రానున్న ‘నంది’ జాతర…. సీఎంకు థాంక్స్ చెప్పిన నిర్మాతల మండలి
-
Chandigarh ODI : తొలుత తడబడి.. ఆపై నిలబడి.. కరీబియన్ బౌలర్లపై టీమిండియా దండయాత్ర
-
Sajjala Ramakrishna Reddy : లోకల్ ఎలక్షన్స్‌కు వైసీపీ లీగల్ టీమ్ రెడీ.. సజ్జల కీలక ఆదేశాలు
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!