NTV Telugu Site icon

Aashika Bhatia: అవును.. నాకు ఆ ‘పాడు’ అలవాటు ఉంది.. అమ్మకి కూడా తెలుసు

Ashika Bhatia

Ashika Bhatia

Aashika Bhatia: సాధారణంగా నటీనటులు తమ వ్యక్తిగత విషయాలను మీడియాతో పంచుకోవడానికి ఏమాత్రం ఇష్టపడరు. తమకు సంబంధించి ఏ మేటర్ అయినా, సీక్రెట్‌గా ఉంచుతారు. కానీ కొందరు మాత్రం.. నిర్భయంగా తమ చెడు అలవాట్లను కూడా బయటపెడుతుంటారు. ఇప్పుడు ఆషికా భాటియా తనకున్న స్మోకింగ్ అడిక్షన్ గురించి చెప్పుకొచ్చింది. తనకు సిగరెట్, మద్యం తాగే అలవాటు ఉందని కుండబద్దలు కొట్టిన ఆమె.. ఈ విషయం తన తల్లికి కూడా తెలుసని మరో షాక్ ఇచ్చింది. బిగ్‌బాస్ ఓటీటీ సీజన్-2 నుంచి ఎలిమినేట్ అయిన అనంతరం ఓ ఇంటర్వ్యూలో ఈ షాకింగ్ విషయాలు వెల్లడించింది.

Ayush Visa:’ఆయుష్ వీసా’తీసుకొచ్చిన ప్రభుత్వం.. పెరగనున్న మెడికల్ టూరిజం

‘‘నాకు స్మోకింగ్ అలవాటు ఉంది. ఈ విషయం గురించి మా అమ్మకు కూడా తెలుసు కాబట్టి.. ఇతరులు ఏం మాట్లాడుతారనేది నేను పట్టించుకోను. అయినా ఈ ప్రజలు కూడా అవసరమైన దానికంటే అనవసర విషయాలకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు’’ అంటూ చెప్పుకొచ్చింది. తాను ఆరు నెలల క్రితం వరకు ఆల్కహాల్, ఎనర్జీ డ్రింక్స్ బాగా తాగేదాన్నని తెలిపింది. రోజుకి 6-7 ఎనర్జీ డ్రింక్స్ తాగేదాన్నని, చివరికి ఆరు నెలల క్రితం వాటిని తాగడం మానేశానని చెప్పింది. అయితే.. సిగరెట్‌పై జరిగిన గొడవ కారణంగా, ఈ విషయం పెద్దగా హైలైట్ అయ్యిందని పేర్కొంది. తన స్మోకింగ్ అడిక్షన్ గురించి పదిమందికి తెలిసినా తనకేమీ ఫరక్ పడదని, తనకు ఎలాంటి సమస్య లేదని తెగేసి చెప్పింది. ‘తల్లికే తెలిసినప్పుడు, వేరే వాళ్లతో పనేంటి?’ అని క్లారిటీ ఇచ్చింది.

What’s Today: ఈరోజు ఏమున్నాయంటే..?

ఇక ఇదే సమయంలో తన ఎలిమినేషన్ గురించి మాట్లాడుతూ.. తాను ఈ షో నుంచి ఎలిమినేట్ అయినందుకు నిరాశ చెందడం లేదని, కానీ నామినేషన్ ప్రక్రియ గురించి బాధపడ్డానని చెప్పుకొచ్చింది. ఎందుకంటే.. రెండు నామినేషన్లు మాత్రమే వచ్చాయని ఆవేదన వ్యక్తం చేసింది. ఇది అన్యాయమే అయినప్పటికీ.. ఇదంతా ఆటలో ఒక భాగమే కాబట్టి, చివరికి ఎవరైనా వెళ్లిపోవాల్సిందేనని చెప్పింది. ఈసారి తన వంతు వచ్చింది కాబట్టి, ఎలిమినేట్ అయ్యానని కూల్‌గా సమాధానం ఇచ్చింది.

Show comments