Site icon NTV Telugu

ఓటీటీలో అడుగుపెట్టిన గోపీచంద్ ‘ఆరడగుల బుల్లెట్’

గోపీచంద్, నయనతార జంటగా నటించిన ‘ఆరడగుల బుల్లెట్’ సినిమా అక్టోబర్ 8న థియేటర్లలో విడుదలైంది. అయితే ఆశించిన రీతిలో ఈ సినిమా ఫలితం సాధించడంలో విఫలమైంది. తాజాగా ఈ మూవీలో ఓటీటీలోకి వచ్చేసింది. అమెజాన్ ప్రైమ్ ఓటీటీ వేదికగా ఈ సినిమా స్ట్రీమింగ్ అవుతోంది. యాక్షన్ ప్యాక్డ్ ఎంటర్‌టైనర్‌గా ఈ మూవీ తెరకెక్కింది. ప్రముఖ దర్శకుడు బి.గోపాల్ ఈ మూవీకి దర్శకత్వం వహించాడు. ఆయన మార్కు కత్తులు, వ్యాన్‌లు గాల్లోకి ఎగరడం అన్నీ ఈ సినిమాలో ఉన్నాయి. వక్కంతం వంశీ కథను అందించగా… మణిశర్మ సంగీతం సమకూర్చాడు. కాగా నాలుగేళ్ల క్రితమే ఈ సినిమా విడుదల కావాల్సి ఉండగా ఆర్థిక ఇబ్బందుల కారణంగా జాప్యం చోటుచేసుకుంది.

Exit mobile version