Site icon NTV Telugu

Ameer Khan : ఎందుకూ పనికి రానని బాధపడుతున్నా : స్టార్ హీరో కుమార్తె

Ira

Ira

Ameer Khan : బాలీవుడ్ బడా హీరో అమీర్ ఖాన్ కు ఎంత పెద్ద ఫ్యాన్ బేస్ ఉందో తెలిసిందే. ఆయన తీసే సినిమాలతో ప్రత్యేక ఇమేజ్ సంపాదించుకున్నాడు. అంతే కాకుండా సినిమాలతో వేల కోట్ల ఆస్తులు సంపాదించాడు. అలాంటి అమీర్ ఖాన్ కూతురు తాను ఎందుకూ పనికి రానని బాధపడుతున్నట్టు తెలిపింది. ఆమె చేసిన ఈ కామెంట్స్ ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. అమీర్ ఖాన్, ఆమె కూతురు ఐరాఖాన్ తాజాగా ఓ పాడ్ కాస్ట్ ప్రోగ్రామ్ లో పాల్గొన్నారు. ఇందులో ఐరాఖాన్ మాట్లాడుతూ.. తనకు 25 ఏళ్లు వచ్చినా సరే దేనికీ పనికి రాకుండా పోతున్నాననే బాధ ఉందని చెబుతూ ఎమోషనల్ అయింది. ఇప్పటికీ తాను రూపాయి కూడా సంపదించట్లేదని.. ప్రపంచంలో తాను దేనికీ పనికి రానేమో అనే బాధ ఉందని ఐరాఖాన్ చెబుతూ ఎమోషనల్ అయింది.
Read Also : Music Director Koti : గీతాకృష్ణ ఇక ఆపెయ్.. మ్యూజిక్ డైరెక్టర్ కోటి కౌంటర్

ఆమె వ్యాఖ్యలను అమీర్ ఖాన్ ఒప్పుకోలేదు. ఎందుకంటే తన కూతురు చిన్న వయసులోనే ఎంతో మందికి సాయం చేస్తోందని.. సంపాదన కన్నా సేవ గొప్పది అంటూ అమీర్ ఖాన్ తెలిపారు. కాబట్టి ఈ విషయంలో అమీర్ ఖాన్ తన కూతురుకు సపోర్ట్ చేశారు. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. ఐరాఖాన్ అగస్త్య అనే ఫౌండేషన్ ను స్థాపించి చాలా మందికి సాయం చేస్తోంది. ఆమె రీసెంట్ గానే ఓ జిమ్ ట్రైనర్ తో డేటింగ్ చేసి పెళ్లి చేసుకుంది. అమీర్ ఖాన్ కూతురు అయినా కూడా సినిమాల్లోకి రాలేదు. అమీర్ ఖాన్ విడాకుల తర్వాత కర్ణాటకకు చెందిన మహిళతో డేటింగ్ చేస్తున్నారు.

Exit mobile version