Site icon NTV Telugu

Aamir Khan: రోజుకు వంద పాన్లు తిన్న ఆమిర్‌ ఖాన్‌.. కారణం వింటే షాక్ అవుతారు!

Amerkhan Pk

Amerkhan Pk

సినిమా కోసం ఓ స్టార్ ఎంతకైనా తెగిస్తాడు, కష్టపడతాడు.. డూప్ ను కూడా ఇష్టపడని హీరోలు ఉన్నారు . ఎలాంటి సీన్ అయిన తమ భుజం మీద వేసుకుని ఫ్యాన్స్ కోసం ప్రాణాలు కూడా పణంగా పెడుతున్నారు. తాజాగా బాలీవుడ్ స్టార్ హీరో అమీర్ ఖాన్ కూడా అలాంటి సాహసమే చేశారు. మూవీ కోసం రోజుకు 100 పాన్‌లు తిన్నాడంటే నమ్మగలరా? కానీ బాలీవుడ్ మిస్టర్ పర్ఫెక్షనిస్ట్.. పాత్రకు పూర్తి న్యాయం చేయడమే తన ధ్యేయంగా పెట్టుకుని ఈ పని చేశాడు.

Also Read : Manchu Brothers : ఫ్యామిలీ గొడవలు పక్కన పెట్టి మళ్లీ ఒక్కటవ్వనున్న మంచు బ్రదర్స్?

2014లో విడుదలైన ‘పీకే’ చిత్రం బాక్సాఫీస్ వద్ద బ్లాక్‌బస్టర్ హిట్‌గా నిలిచిన విషయం తెలిసిందే. రాజ్‌కుమార్ హిరాణీ దర్శకత్వంలో తెరకెక్కిన  ఈ మూవీలో ఆమిర్ ఖాన్ ఓ గ్రహాంతరవాసి (ఏలియన్) పాత్రలో నటించాడు. అయితే భూమిపై మనుషు‌ల భాష, ఆహారం, జీవన విధానం నేర్చుకునే ఈ పాత్రలో అమీర్ పాన్ నములుతూ కనిపించేలా ఉండాలి. అందుకే షూటింగ్ సమయంలో ఆయన ప్రతిరోజూ పాన్ తినేవాడు. పాత్రలో సహజత్వం రావడానికి ఆమిర్ పాన్ నమలడం అలవాటు చేసుకున్నాడు. రోజుకు 100 పాన్‌లు తినేవాడని ఆమిర్ స్వయంగా ఒక ఇంటర్వ్యూలో వెల్లడించాడు.

ఆమిర్ మాట్లాడుతూ.. “పాత్రలో సహజత్వం కోసం అలా చేశాను. పెదవులు సహజంగా ఎర్రగా కనిపించాలంటే నిజమైన పాన్ నమలడం తప్పదని అనిపించింది. అందుకే సెట్‌లో ఒక ప్రత్యేక పాన్‌వాలాను ఉంచాము. అతడే నాకు రోజంతా పాన్లు తయారు చేసేవాడు. కానీ రోజంతా పాన్ తినడం వల్ల నాకు నోట్లో పొక్కులు వచ్చాయి. అయినా షూటింగ్ పూర్తయ్యే వరకు ఆగలేదు. పాత్ర కోసం ఆ బాధ భరించాను” అని ఆయన చెప్పాడు. ఆమిర్‌తో కలిసి నటించిన అనుష్క శర్మ కూడా ఈ విషయాన్ని గుర్తుచేసుకుంటూ – “ఆమిర్ రోజంతా పాన్ నములుతూనే ఉండేవాడు. ఎంత కష్టమైనా ఆయన ఆపేవాడు కాదు. చూస్తేనే బాధగా అనిపించేది” అని చెప్పింది.

Exit mobile version