సీనియర్ నటి ఆమని గురించి ప్రత్యేకం గా చెప్పాల్సిన పని లేదు.. మావిచిగురు , శుభలగ్నం వంటి చిత్రాల లో నటించి తన అద్భుతమైన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకున్న సీనియర్ నటి ఆమని జూన్ 14న అన్నవరంలోని సత్యదేవుడిని దర్శించుకున్నారు. రత్నగిరిలోనే స్వామి వారికి పూజలు నిర్వహించి న అనంతరం మీడియాతో మాట్లాడుతూ అన్నవరం ఆలయానికి రావడం ఇది రెండవసారి అని ఆమె తెలిపింది.. అలాగే పవన్ కళ్యాణ్ వారాహి యాత్ర గురించి కూడా మాట్లాడగా ఆ మాటలు బాగా వైరల్ గా మారాయి..నారాయణ అండ్ కో అనే సినిమా షూటింగ్ కోసం ఆ ప్రాంతాని కి వచ్చినట్లు యూనిట్ సభ్యులందరూ సత్యదేవుని దర్శించుకోవాలని అనుకున్నట్లు ఆమె చెప్పుకొచ్చింది.సినిమా యూనిట్ అంతా కూడా కలిసి స్వామివారిని దర్శించుకున్నాము అని ఆమె తెలిపింది. ఇక ఈ సినిమా లో నేను లీడ్ పాత్ర పోషిస్తున్నాను పవన్ కళ్యాణ్ ఆలయాని కి వస్తారని తెలిసి మేము తొందరగా వచ్చి దర్శనం చేసుకున్నాం అని ఆమె తెలిపారు.
మేము అన్నవరం ఆలయాన్ని దర్శించుకున్న రోజే పవన్ కళ్యాణ్ అక్కడికి రావడం ఎంతో సంతోషం గా ఉందని అది గర్వంగా కూడా అనిపిస్తోంది అంటూ కూడా ఆమె తెలిపింది. పవన్ కళ్యాణ్ వారాహి యాత్ర ఇక్కడి నుంచే ప్రారంభిస్తున్నారు అని తెలిసినప్పుడు ఇంకా ఆనందం వేసింది అనుకోకుండా ఇక్కడికి రావడం నా అదృష్టంగా అయితే భావిస్తున్నాను. సమాజానికి మంచి చేయాలన్న ఆయన ఉన్నత లక్ష్యం కచ్చితం గా నెరవేరుతుంది అదే ఆయనను ముందుకు నడిపిస్తుంది అని ఆమె తెలిపింది.పవన్ కళ్యాణ్ లాంటి వ్యక్తులు రాజకీయాల్లో కి రావడం మరింత ఉత్తమమైన పని అని ఎలాంటి ప్రతిఫలం ను ఆశించకుండా ప్రజలకు మంచి చేయాలనే ఉద్దేశం ఆయనలో ఎక్కువగా ఉంటుంది. ఆయనలో ఎప్పుడూ కూడా గర్వం ఉండదు . ఆయన నిజం గా ఎంతో గ్రేట్ అని ఆయనను ప్రజలు ఆశీర్వదించాలి చెప్పుకొచ్చింది ఆమని.
