విలక్షణ నటుడు సముద్రఖని, వినయ్ వర్మ, తేజ కాకుమాను, ప్రశాంత్ ప్రధాన పాత్రధారులుగా తెరకెక్కుతున్న డిఫరెంట్ కాన్సెప్ట్ మూవీ ‘ఆకాశవాణి’. దర్శకధీరుడు రాజమౌళి వద్ద దర్శకత్వ శాఖలో పనిచేసిన అశ్విన్ గంగరాజు ఈ చిత్రంతో దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. ఏయూ అండ్ ఐ స్టూడియోస్ బ్యానర్ పై పద్మనాభ రెడ్డి ‘ఆకాశవాణి’ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. కాల భైరవ మ్యూజిక్ కంపోజ్ చేయగా, సాయి మాధవ్ బుర్రా డైలాగ్స్ రాస్తున్నారు. శ్రీకర్ ప్రసాద్ ఈ చిత్రానికి ఎడిటర్ కాగా, సినిమాటోగ్రఫీ సురేష్ రగుతు నిర్వహించారు. తాజాగా ఈ చిత్రం సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుంది.
Read Also : టాలీవుడ్ డ్రగ్స్ కేసు.. మరింత దూకుడుగా ఈడీ..!
ఈ విలేజ్ డ్రామాకు సెన్సార్ సభ్యులు ‘U/A’ సర్టిఫికేట్ జారీ చేశారు. క్రూరమైన భూస్వామికి వ్యతిరేకంగా గిరిజనులు చేస్తున్న పోరాటాన్ని కొత్త నటీనటులతో చూపించబోతున్నారు. రేడియో ట్రాన్సిస్టర్ ఇందులో కీలక పాత్ర పోషిస్తోంది. కొద్ది రోజుల క్రితం యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ఈ సినిమా ట్రైలర్‌ను విడుదల చేసి మేకర్స్‌కు శుభాకాంక్షలు తెలిపారు. ‘ఆకాశవాణి’ సినిమాలో ఎక్కువ భాగం విశాఖపట్నంలోని పాడేరు కొండ ప్రాంతంలో చిత్రీకరించబడింది. ‘ఆకాశవాణి’ చిత్రం సోనీ లివ్‌లో సెప్టెంబర్ 24న నేరుగా విడుదల కానుంది. అయితే ఒకరోజు ముందుగానే సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోందంటూ దర్శకుడు అశ్విన్ వెల్లడించారు. ఈ రోజు రాత్రి నుంచే మూవీ స్ట్రీమింగ్ కానుంది.
