NTV Telugu Site icon

Aadikeshava: మమ్మల్ని క్షమించండి.. సరైన సమయానికి రిలీజ్ చేయలేకపోతున్నాం

Adi

Adi

Aadikeshava: ఉప్పెన సినిమాతో తెలుగుతెరకు పరిచయమయ్యాడు మెగా మేనల్లుడు వైష్ణవ్ తేజ్. మొదటి సినిమాతోనే భారీ విజయాన్ని అందుకున్న వైష్ణవ్ ఆ తరువాత అలాంటి విజయాన్ని మాత్రం అందుకోలేకపోయారు. ఇక ప్రస్తుతం మెగా మేనల్లుడు ఆశలన్నీ ఆదికేశవ మీదనే పెట్టుకున్నాడు. వైష్ణవ్ తేజ్, శ్రీలీల జంటగా శ్రీకాంత్ ఎన్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని సితార ఎంటర్ టైన్మెంట్స్ బ్యానర్ పై సూర్యదేవర నాగవంశీ నిర్మించాడు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన పోస్టర్స్, టీజర్, సాంగ్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఇక నేడు ఈ సినిమా ట్రైలర్ ను మేకర్స్ రిలీజ్ చేస్తున్నట్లు రెండు రోజుల క్రితమే అధికారికంగా ప్రకటించారు. ఇక ఈ ట్రైలర్ కోసం అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్న విషయం తెల్సిందే. అయితే తాజాగా ఈ ట్రైలర్ రావడం లేదని మేకర్స్ తెలిపారు.

Perfume Movie: స్మెల్ బేస్డ్ థ్రిల్లింగ్ కాన్సెప్ట్‌‌తో ‘పర్‌ఫ్యూమ్’.. గ్రాండ్ గా ప్రీ రిలీజ్ ఈవెంట్‌

“కొన్ని సాంకేతిక సమస్యల కారణంగా మా ఆదికేశవ ట్రైలర్ విడుదలను వాయిదా వేయవలసి వచ్చింది.. ఈ చివరి నిమిషంలో రద్దు చేసినందుకు, మీకు కలిగించిన అసౌకర్యానికి. మా మీడియా మిత్రులు మరియు అభిమానులందరికీ మేము క్షమాపణలు కోరుతున్నాము” అంటూ మేకర్స్ చెప్పుకొచ్చారు. దీంతో అభిమానులు నిరాశ చెందారు. త్వరలోనే మరో ట్రైలర్ రిలీజ్ డేట్ ను అనౌన్స్ చేయనున్నారు. అందుతున్న సమాచారం ప్రకారం వచ్చే వారం ఈ ఈవెంట్ ఉండనుందని తెలుస్తోంది. ఇక ఈ సినిమాలో మలయాళ స్టార్ నటుడు జోజు జార్జ్ విలన్ గా నటిస్తున్నాడు. మరి ఈ సినిమాతో వైష్ణవ్ ఎలాంటి విజయాన్ని అందుకుంటాడో చూడాలి.