Aadi Saikumar Tees Maar Khan Trailer Review: ఆది సాయికుమార్, పాయల్ రాజ్‌పుత్ జంటగా ‘తీస్ మార్ ఖాన్’ చిత్రం రూపుదిద్దుకుంది. ‘నాటకం’ వంటి భిన్న కథాంశ చిత్రాన్ని తెరకెక్కించిన కళ్యాణ్ జి గోగణ దర్శకత్వంలో డా. నాగం తిరుపతి రెడ్డి ఈ సినిమాను నిర్మించారు. ఆగస్ట్ 19న ‘తీస్ మార్ ఖాన్’ మూవీ జనం ముందుకు రాబోతోంది. ఈ సందర్భంగా తాజాగా మూవీ ట్రైలర్ ను రిలీజ్ చేశారు. ‘మా అమ్మను తప్పుగా చూశారు. మా అమ్మ జోలికొస్తే ఏ అమ్మ కొడుకైనా కొడతా’ అనే పదునైన డైలాగ్ తో ఆది సాయి కుమార్ బాల్యాన్ని చూపించారు. దాంతో ఆ పాత్ర ఎంత పవర్ ఫుల్ గా ఉంటుందో దర్శకుడు చెప్పకనే చెప్పినట్టు అయ్యింది.
2 నిమిషాల 42 సెకన్ల నిడివితో కట్ చేసిన ఈ ట్రైలర్ లో మదర్ సెంటిమెంట్, లవ్ అండ్ యాక్షన్ సీన్స్ కు ప్రాధాన్యమిచ్చారు. ఎంటర్ టైన్ మెంట్ కూ ఇందులో కొదవలేదని కొన్ని సీన్స్ చూస్తే అర్థమౌతోంది. ‘ఆర్.ఎక్స్. 100’తో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన పాయల్ రాజ్ పుత్ మరోసారి ఈ సినిమాలో అందాల విందుకు సిద్ధపడింది. సాయి కార్తీక్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఈ ట్రైలర్ లో మరో హైలైట్. మొత్తంగా చూస్తే ఈ ట్రైలర్ మూవీపై అంచనాలను పెంచేట్టుగా ఉంది. స్టూడెంట్, రౌడీ, పోలీస్ గా మూడు వేరియేషన్స్ ఉన్న పాత్రలో ఆది సాయికుమార్ నటించడం విశేషం. పూర్ణ, సునీల్, అనూప్ సింగ్ ఠాకూర్, కబీర్ సింగ్ ఇందులో కీలక పాత్రను పోషించారు.
