Production No.3: పాన్ ఇండియా లెవెల్ లో ఆది సాయికుమార్ కొత్త సినిమా.. భయపెట్టే పోస్టర్‌తో అనౌన్స్‌మెంట్.!

  • హీరో ఆది సాయికుమార్ కొత్త పాన్ ఇండియా ప్రాజెక్ట్‌
  • త్రిశూల్ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై ప్రొడక్షన్ నం.3గా
  • సినిమా అనౌన్స్‌మెంట్ పోస్టర్‌ విడుదల..
Aadi Saikumar Production No.3

Aadi Saikumar Production No.3

Aadi Saikumar Production No.3: హీరో ఆది సాయికుమార్ మరో ఆసక్తికరమైన ప్రాజెక్ట్‌తో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతున్నారు. త్రిశూల్ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ బ్యానర్‌పై తెరకెక్కనున్న ప్రతిష్ఠాత్మక ప్రొడక్షన్ నం.3లో ఆయన హీరోగా నటిస్తున్నారు. పాన్ ఇండియా స్థాయిలో భారీగా రూపొందనున్న ఈ సినిమాను గ్రాండ్ గా తెరకెక్కించేందుకు మేకర్స్ సిద్ధమవుతున్నారు.

ఈ సినిమాను ప్రకటిస్తూ మేకర్స్ విడుదల చేసిన పోస్టర్ ఆసక్తిని రేకెత్తిస్తోంది. ఓ భారీ నాగుపాము త్రిశూలం చుట్టూ చుట్టుకుని ఉన్నట్లు పోస్టర్‌ను డిజైన్ చేశారు. దట్టమైన అడవిలోని ఓ పురాతన ఆచార ప్రదేశాన్ని తలపించే వాతావరణం పోస్టర్‌లో కనిపిస్తోంది. చుట్టూ పెద్దపెద్ద ఆయుధాలు, వెలుగుతున్న దీపాలు, వేలాడుతున్న గంటలు ఉండటంతో పోస్టర్‌కు మరింత భయానక, మిస్టీరియస్ లుక్ వచ్చింది. దీంతో ఈ సినిమా కథ దైవ రహస్యం, సస్పెన్స్ చుట్టూ సాగుతుందనే ఆసక్తి నెలకొంది.

దైవిక రహస్యం, ఉత్కంఠభరితమైన అంశాలతో ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నట్లు మేకర్స్ వెల్లడించారు. భారీ నిర్మాణ విలువలతో తెరకెక్కనున్న ఈ ప్రాజెక్ట్‌ను తెలుగు సహా కన్నడ, హిందీ, తమిళ్, మళియాల భాషల్లో పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. అయితే ఈ సినిమాకు సంబంధించిన దర్శకుడు, హీరోయిన్, ఇతర నటీనటులు, విడుదల తేదీ వంటి వివరాలను మేకర్స్ ఇంకా వెల్లడించ లేదు. ఈ నెల 20వ తేదీన మరిన్ని వివరాలను తెలిపనున్నట్లు పోస్టర్ లో తెలిపారు.