Aadhi Pinisetty: ఒక విచిత్రం సినిమాతో తెలుగుతెరకు పరిచయమయ్యాడు ఆది పినిశెట్టి. హీరోగానే కొనసాగకుండా నటుడిగా మారాడు. విలన్ గా, సపోర్టింగ్ రోల్స్ లో కూడా నటిస్తూ వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకుంటున్నాడు. ఇక రంగస్థలం సినిమాలో రామ్ చరణ్ కు అన్నగా నటించి మెప్పించిన ఆది ఈ ఏడాది మే లో తాను ప్రేమించిన అమ్మాయి, నటి నిక్కీ గల్రాని ను వివాహమాడి వైవాహిక జీవితంలోకి అడుగు పెట్టిన విషయం తెల్సిందే.
ప్రస్తుతం ఈ జంట వెకేషన్ లో ఎంజాయ్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇక కోలీవుడ్ లో అందుతున్న సమాచారం ప్రకారం ఈ నిక్కీ- ఆది త్వరలోనే తల్లిదండ్రులు కానున్నారట. నిక్కీ ప్రస్తుతం ప్రెగ్నెంట్ అని వార్తలు వస్తున్నాయి. అయితే ఈ విషయమై అధికారికంగా ఎటువంటి సమాచారం లేదు కానీ.. వార్త మాత్రం నిజమే అని కోలీవుడ్ కోడై కూస్తోంది. మరి ఈ వార్తలో నిజం ఎంత అనేది తెలియాలంటే ఈ జంట నోరు విప్పాల్సిందే.