Site icon NTV Telugu

‘ఆడవాళ్ళూ మీకు జోహార్లు’ అంటూ విషెస్ తెలిపిన శర్వానంద్

sharwanad

sharwanad

టాలీవుడ్ యంగ్ హీరో శర్వానంద్ కి గతేడాది కలిసి రాలేదన్న విషయం తెలిసిందే. వరుస పరాజయాలు శర్వా ను పలకరించాయి. జాను, మహా సముద్రం చిత్రాలు శర్వా కెరీర్లోనే బిగ్గెస్ట్ డిజాస్టర్లు గా నిలిచాయి. ఇక ఈ ఏడాది కొత్తగా ప్రారంభిస్తూ శర్వా కొత్త సినిమాలతో విజయాన్ని అందుకోవాలని చూస్తున్నాడు. ఇప్పటికే ‘ఒకే ఒక జీవితం’ షూటింగ్ ని పూర్తి చేసుకోగా, ‘ఆడవాళ్లు మీకు జోహార్లు’ చిత్రం సెట్స్ మీద ఉన్నది. చిత్ర లహరి చిత్రంతో సాయి ధరమ్ తేజ్ కి మర్చిపోలేని హిట్ ఇచ్చిన కిషోర్ తిరుమల ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు.

ఇక ఈ సినిమాలో శర్వా సరసన హిట్ హీరోయిన్ రష్మిక మందన్నా నటిస్తోంది. ఇక నేడు నూట సంవత్సరం శుభాకాంక్షలు తెలుపుతూ చిత్ర బృందం కొత్త పోస్టర్ ని రిలీజ్ చేసింది. పెళ్లి బట్టలో శర్వా, రష్మిక వారి పక్కన వెన్నెల కిషోర్, రాధికా శరత్ కుమార్, కుష్బూ , ఊర్వశి చిందులు వేస్తూ కనిపించారు. ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాకు దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ ని అందిస్తున్నాడు. మరి ఈ సినిమాతోనైనా శర్వా హిట్ ట్రాక్ ఎక్కుతాడేమో చూడాలి.

Exit mobile version