Site icon NTV Telugu

Aadavaalu Meeku Johaarlu : ట్రైలర్ కు ముహూర్తం ఖరారు

AMJ

ప్రామిసింగ్ యాక్టర్ శర్వానంద్, రష్మిక మందన్న జంటగా నటించిన చిత్రం “ఆడవాళ్ళు మీకు జోహార్లు”. ఈ ఫ్యామిలీ ఎంటర్టైనర్ ఫిబ్రవరి 25న థియేటర్లలో సందడి చేయడానికి సిద్ధంగా ఉంది. ఎస్ఎల్వీ సినిమాస్ బ్యానర్‌ పై సుధాకర్ చెరుకూరి నిర్మించిన ఈ చిత్రానికి తిరుమల కిషోర్ దర్శకత్వం వహించారు. సినిమా విడుదలకు మరో వారం రోజులు మాత్రమే ఉండడంతో మేకర్స్ ప్రొమోషన్ కార్యక్రమాల్లో వేగం పెంచారు. ఇటీవలే టీజర్ ను విడుదల చేసి అందరి దృష్టిని ఆకర్షించిన “ఆడవాళ్ళు మీకు జోహార్లు” టీం ఇప్పుడు ట్రైలర్ ను విడుదల చేయడానికి సిద్ధమయ్యారు.

Read Also : Bappi Lahiri : అంత్యక్రియలు పూర్తి

“ఆడవాళ్ళు మీకు జోహార్లు” థియేట్రికల్ ట్రైలర్‌ను ఫిబ్రవరి 19న విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ఓ ప్రత్యేక పోస్టర్‌ ద్వారా ట్రైలర్ విడుదల తేదీని రివీల్ చేశారు. అందులో శర్వానంద్ తన ఫ్యామిలీతో కనిపిస్తున్నాడు. ఈ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌లో సీనియర్ నటీమణులు ఖుష్బు సుందర్, రాధిక శరత్‌కుమార్, ఊర్వశి కీలక పాత్రలు పోషిస్తున్నారు. రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ ఈ చిత్రానికి సంగీతం అందించారు. త్వరలోనే విడుదల కానున్న ఈ సినిమా గురించి ఫ్యామిలీ ఆడియన్స్ ఆతృతగా ఎదురు చూస్తున్నారు.

Exit mobile version