Site icon NTV Telugu

AA22×A6 : అల్లు అర్జున్ – అట్లీ కాంబో హాలీవుడ్ టచ్‌తో భారీ ప్లాన్!

Aa22×a6

Aa22×a6

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్- అట్లీ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న మూవీ పై ప్రేక్షకులు ఎంతో ఆత్రుతగా ఉన్నారు. ఈ చిత్రం ప్రస్తుతం భారతీయ సినీ ఇండస్ట్రీలోనే కాదు, అంతర్జాతీయ మార్కెట్‌లో కూడా ప్రత్యేక దృష్టిని ఆకర్షిస్తోంది. ఫిల్మ్ యూనిట్ ఈ చిత్రానికి తాత్కాలికంగా “AA22×A6” అనే వర్కింగ్ టైటిల్‌ను ఫిక్స్ చేయగా. తాజా సమాచారం ప్రకారం, ఈ సినిమాకు హాలీవుడ్ టచ్ ఇవ్వాలని మేకర్స్ భావిస్తున్నారు. అందుకోసం హాలీవుడ్‌లోని ఒక ప్రముఖ స్టూడియో, ఈ ప్రాజెక్ట్‌ను సన్ పిక్చర్స్‌తో కలిసి కో-ప్రొడ్యూస్ చేయడానికి చర్చలు జరుపుతోందని టాక్ వినిపిస్తోంది. అయితే ఏ స్టూడియో అనే వివరాలు ఇంకా బయటకు రాలేదు. చర్చలు ప్రస్తుతం ప్రారంభ దశలో ఉన్నట్లు తెలుస్తోంది.

Also Read :OG: పవన్ – ప్రియాంక మెలోడీ సాంగ్ రిలీజ్ డేట్ లాక్! ఫ్యాన్స్ ఊహించని సర్‌ప్రైజ్

ఇక ఈ చిత్రాన్ని కేవలం పాన్-ఇండియా స్థాయిలో మాత్రమే కాకుండా, పాన్-వరల్డ్ లెవెల్లో రిలీజ్ చేయాలనే ఆలోచనలో టీమ్ ఉంది. ఇందుకోసం యుఎస్‌ఏలోని ఓ క్రియేటివ్ ఏజెన్సీతో కలిసి ఒక ఇంటర్నేషనల్ ప్రమోషన్ స్ట్రాటజీ రూపొందించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. గ్లోబల్ మార్కెట్‌ను టార్గెట్ చేస్తూ, ఈ ప్రాజెక్ట్‌కు విస్తృత స్థాయి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. అల్లు అర్జున్ గత చిత్రం “పుష్ప”తో అల్‌రెడి నేషనల్ స్థాయిలోనే కాదు, గ్లోబల్ మార్కెట్‌లో కూడా విపరీతమైన పాపులారిటీ సాధించారు. ఈ సక్సెస్ తర్వాత అట్లీ దర్శకత్వం వహిస్తున్న ఈ భారీ ప్రాజెక్ట్‌పై అంచనాలు మరింత పెరిగాయి. హాలీవుడ్ స్టూడియో భాగస్వామ్యం, పాన్-వరల్డ్ ప్రమోషన్ ప్లాన్ వాస్తవమైతే, ఇది ఇండియన్ సినిమా స్టాండర్డ్స్‌ను మరో లెవెల్‌కు తీసుకెళ్లే అవకాశం ఉంది.

Exit mobile version