Aa Okkati Adakku: సినిమాల్లో కొన్ని జంటలను చూస్తే.. నిజంగా వీళ్లు బయట పెళ్లి చేసుకొంటే ఎంత బావుంటుందో అని అనుకోవడం సహజం. అందుకు కారణం.. వారు మేడ్ ఫర్ ఈచ్ అదర్ లా కనిపిస్తారు. ఒడ్డు, పొడువు.. పక్కపక్కన ఉంటే చక్కగా మంచి జంటలా కనిపిస్తారు. అంతేకాకుండా వారిద్దరి రొమాన్స్ సైతం అందరికి చూడముచ్చటగా ఉంటుంది. ఇండస్ట్రీలో హైట్ ఉన్న హీరోలకు.. అంతే హైట్ ఉన్న హీరోయిన్స్ దొరకడం కష్టం. చాలా రేర్ గా ఆ కెమిస్ట్రీ వర్క్ అవుట్ అవుతుంది. అలా వర్క్ అవుట్ అయిన జంటల్లో ప్రభాస్- అనుష్క ఒకటి. ప్రభాస్ హైట్ కు అనుష్క పర్ఫెక్ట్ గా మ్యాచ్ అవుతుంది. ఇక ఈ జంట తరువాత అంత పర్ఫెక్ట్ గా మ్యాచ్ అయిన జంట అంటే అల్లరి నరేష్- ఫరియా అబ్దుల్లా అనే చెప్పాలి. వీరిద్దరూ జంటగా నటిస్తున్న చిత్రం ఆ ఒక్కటీ అడక్కు. మల్లి అంకం దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని చిలకా ప్రొడక్షన్స్ బ్యానర్‌పై రాజీవ్ చిలక నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన పోస్టర్స్, ఫస్ట్ గ్లింప్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి.
ఇక తాజాగా ఈ సినిమాలోని మొదటి సాంగ్ ను మ్యూజిక్ సెన్సేషన్ ఎస్ఎస్ థమన్ లాంచ్ చేశాడు. ఓ.. మేడమ్ అంటూ సాగే ఈ సాంగ్ ఆద్యంతం ఆకట్టుకుంటుంది. మనసుని హత్తుకునే మెలోడీ నంబర్స్ స్కోర్ చేయడంలో స్పెషలిస్ట్ అయిన గోపీ సుందర్ ఎనర్జిటిక్ మెలోడీని అందించాడు. లిరిసిస్ట్ భాస్కరభట్ల కథానాయకుడిలోని భావాలను అద్భుతంగా వ్యక్తం చేశారు. అనురాగ్ కులకర్ణి తన ప్లజెంట్ వోకల్స్ తో మ్యాజిక్ చేశాడు. మొత్తంగా, ఈ పాట ఇన్స్టంట్ గా కనెక్ట్ అవుతుంది. అల్లరి నరేష్, ఫరియా అబ్దుల్లాల జోడి తెరపై ఫ్రెష్ గా కనిపించింది. అల్లరి నరేష్ ఆమెతో ఫ్లర్ట్ చేస్తుండగా, ఆమె అతని కంపెనీని ఆనందిస్తుంది. ఇక ఈ జంటకు అభిమానులు ఫిదా అవుతున్నారు. ప్రభాస్ – అనుష్క జోడీ తరువాత పర్ఫెక్ట్ జంట మీరే.. అంటూ కామెంట్స్ పెడుతున్నారు. ఇకపోతే మార్చి 22 ఈ సినిమా రిలీజ్ కు రెడీ అవుతుంది. మరి ఈ సినిమాతో అల్లరి నరేష్ హిట్ అందుకుంటాడో.. లేదో చూడాలి.
