విశ్వక్ సేన్.. మినిమం గ్యారెంటీ హీరో కానీ అదంత లైలా సినిమాకు ముందు. గతేడాది విడుదలైన ‘లైలా’ సినిమా బిగ్గెస్ట్ డిజాస్టర్‌గా నిలవడంతో నటుడు విశ్వక్ సేన్‌పై విమర్శలు వెల్లువెత్తాయి. అసలు విశ్వక్ ఈ సినిమా కథ విన్నాడా లేదా అని ఓ రేంజ్ లో అతడిపై కామెంట్స్ వచ్చాయి. లైలా డిజాస్టర్ తో తన మార్కెట్ ను కూడా పోగొట్టుకున్నాడు విశ్వక్ సేన్. దింతో కొంత గ్యాప్ తీసుకున్న విశ్వక్, తన తదుపరి సినిమాల విషయంలో మరింత జాగ్రత్తగా వ్యవహరిస్తున్నాడు.
Also Read : Abbas – Vineeth : చాలా ఏళ్ల తర్వాత సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇచ్చిన ప్రేమ దేశం హీరోలు
ప్రస్తుతం విశ్వక్ ఫంకీ సినిమా చేస్తున్నాడు. జాతి రత్నాలు ఫేమ్ కేవీ అనుదీప్ డైరెక్షన్ లో తెరక్కుతున్న ఈ సినిమా చాలా విశ్వక్ కెరీర్ కు చాలా కీలకంగా మారింది. ఈ సినిమాపైనే విశ్వక్ భారీ ఆశలు పెట్టుకున్నాడు. ఈ సినిమాలో విశ్వక్ సేన్ ఒక సినిమా దర్శకుడిగా కనిపించబోతుండటం మరో ఆసక్తికర అంశం. కయాదులోహర్ హీరోయిన్ గా నటిస్తోంది. ఎలాగైనా ఈ సినిమాతో హిట్ కొట్టి తన మార్కెట్‌ను మరింత స్ట్రాంగ్ చేయాలనే లక్ష్యంతో విశ్వక్ ఉన్నాడు. ‘ఫంకీ’తో సాలిడ్ హిట్ కొట్టి తిరిగి ట్రాక్‌లోకి రావాలని విశ్వక్ పట్టుదలగా ఉన్నాడు. ఆ మధ్య వచ్చిన గ్లిమ్స్ కు మంచి స్పందన వచ్చింది. కెవి అనుదీప్ మార్క్ ఫన్ తో ఆకట్టుకుంది. అలాగే ఇటీవల వచ్చిన సాంగ్ కూడా మెప్పించింది. పోస్ట్ ప్రోడక్షన్ వర్క్స్ లో బిజిగా ఉన్న ‘ఫంకీ’ చిత్రం ఫిబ్రవరి 13న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాతో విశ్వక్ సేన్ హిట్ కొట్టాలి లేదంటే టైర్ 2 హీరోల రేస్ లో వెనుకబడతాడు.
