Site icon NTV Telugu

Dhadak2 : రీమేక్ సినిమాకు సీక్వెల్.. ఏంటో ఈ బాలీవుడ్ వెర్రి

Bollywood

Bollywood

మరాఠిలో సూపర్ హిట్ అయిన సినిమా సైరాత్. రెండు వేరు వేరు కులాల మధ్య జరిగిన ప్రేమ కథగా వచ్చిన ఈ సూపర్ హిట్ సినిమా అనేక భాషల్లో రీమేక్ అయి హిట్ అయింది. అలా బాలీవుడ్ లోను దడక్ పేరుతో రీమేక్ చేసారు. శశాంక్‌ ఖైతాన్‌ దర్శకత్వంలో ఇషాంత్ కట్టర్ హీరో గా నటించగా   ప్రముఖ నిర్మాత కరణ్ జోహార్ నిర్మించగా అజయ్, అతుల్ సంగీతం అందించారు. అలనాటి అందాల తార శ్రీదేవి కుమార్తె జాన్వీ కపూర్ ఈ సినిమాతోనే సిల్వర్ స్క్రీన్ ఎంట్రీ ఇచ్చింది.

Also Read : Coolie : కూలీ తెలుగు రిలీజ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ డేట్ ఫిక్స్

అయితే ఇప్పుడు ఈ సినిమాకు స్వీక్వెల్ గా దఢక్ 2 ను వస్తోంది. అయితే తీసిందే రీమేక్ సినిమా దానికి మళ్ళి సీక్వెల్, ఏంటో బాలీవుడ్ మేకర్స్ వెర్రి అనే కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్స్. సరైన కథలు లేక ఇలా రీమేక్స్ తో గడిపేస్తున్నారు అని టాక్ వినిపిస్తోంది. పోనీ సీక్వెల్ ను అయినా ఫస్ట్ పార్ట్ లో నటించిన వారితో చేస్తున్నారా అంటే అది లేదు. సిద్ధాంత్ చతుర్వేది హీరోగా యానిమల్ ఫెమ్ త్రిప్తి డిమ్రి హీరోయిన్ గా తెరకెక్కుతోంది దఢక్ 2. అందుకు సంబందించి ఫస్ట్ లుక్ పోస్టర్ ను కూడా రిలీజ్ చేసారు. ఈ సీక్వెల్ కు సాజిద్ ఇక్బాల్ దర్శకత్వం వహిస్తుండగా ధర్మ ప్రొడక్షన్స్ బ్యానర్ పై కరణ్ జోహార్ నిర్మిస్తున్నాడు. జీ స్టూడియోస్ సమర్పణలో వస్తున్న ఈ సినిమా ట్రైలర్ ఈ నెల 11న రిలీజ్ కానుంది. అలాగే ఈ ఏడాది ఆగస్టు 1న వరల్డ్ వైడ్ గా రిలీజ్ కాబోతుంది దఢక్ 2.

Exit mobile version