NTV Telugu Site icon

RRR: ఈ ఫోటోలో చరణ్ ఎక్కడా? ఆ ఫోటో తీసింది ఆయనే కదా…

Ntr Rrr

Ntr Rrr

హీరో గోపీచంద్ నటించిన ‘లౌఖ్యం’ సినిమాలో బ్రహ్మానందం సూపర్బ్ రోల్ లో కనిపించాడు. సెకండ్ హాఫ్ లో గోపీచంద్, బ్రహ్మీల మధ్య వచ్చే సీన్స్ ఆడియన్స్ ని హిలేరియస్ గా నవ్విస్తాయి. ముఖ్యంగా ఒక సీన్ లో గోపీచంద్, బ్రహ్మీకి ఒక ఫ్యామిలీ ఫోటో చూపిస్తాడు. అది చూసిన బ్రహ్మీ “ఇందులో మీ అమ్మ ఏది?” అని అడుగుతాడు, ఆ ప్రశ్నకి సమాధానంగా గోపీచంద్ “ఫోటో తీసింది మా అమ్మనే కదా” అంటూ కౌంటర్ వేస్తాడు. ఈ సీన్ ఇప్పుడు చూసినా ప్రతి ఒక్కరూ నవ్వడం గ్యారెంటి. ఇలాంటి సీన్ ని మీమ్ టెంప్లేట్ గా వాడుతూ సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ ఉంటారు. ఇలాంటి ఒక పోస్ట్ ఇప్పుడు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది.

దర్శక ధీరుడు రాజమౌళి, యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ కలయికలో వచ్చిన యాక్షన్ ఎపిక్ మూవీ ‘ఆర్ ఆర్ ఆర్’. ప్రపంచవ్యాప్తంగా ఉన్న సినీ అభిమానులందరికీ మన ఇండియన్ సినిమా సత్తా ఏంటో చూపిస్తున్న ఆర్ ఆర్ ఆర్ మూవీ ఆస్కార్ రేస్ లో ఉంది. ఈ సినిమా లాస్ ఏంజిల్స్ లో ‘LA చైనీస్ థియేటర్’లో స్పెషల్ స్క్రీనింగ్ వేశారు. చరణ్, ఎన్టీఆర్, రాజమౌళిలు ఫ్యామిలీతో పాటు అటెండ్ అయిన ఈ ఈవెంట్ లో ‘ఆర్ ఆర్ ఆర్’ సినిమాకి హ్యుజ్ అప్రిషిఎషన్స్ దక్కింది. గ్రాండ్ సక్సస్ అయిన ఈ స్క్రీనింగ్ నుంచి ఎన్టీఆర్, రాజమౌళి, కీరవాణి, రమా రాజమౌళి, వల్లి గారు, కార్తికేయ, కాలభైరవ ఉన్న ఫోటో ఒకటి ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అదేంటి చరణ్ కూడా స్క్రీనింగ్ కి వచ్చాడు కదా, మరి ఈ ఫోటోలో చరణ్ ఎక్కడా అంటూ మెగా అభిమానులు అడుగుతుంటే… ఆ ఫోటో తీసింది చరణ్ ఏ అంటూ ఎన్టీఆర్ అభిమానులు చెప్తున్నారు. ప్రస్తుతం ఈ ఫోటో నెట్ లో తెగ వైరల్ అవుతోంది.

Show comments