NTV Telugu Site icon

Masthan Sai : మస్తాన్ సాయి కేసులో కొత్త కోణం…

Masthan Sai

Masthan Sai

రాజ్ తరుణ్, లావణ్య కేసు వ్యవహారం మరోసారి సంచలనంగా మారింది. దాదాపుగా 300మంది అమ్మాయిలను నగ్నంగా వీడియోలు తీసిన మస్తాన్ సాయిప్రేమ, పెళ్లి పేరుతో అమ్మాయిలన లోబర్చుకుంటున్న మస్తాన్ సాయి, సదరు అమ్మాయిలకు తెలియకుండా రికార్డు చేసిన వీడియోలకు సంబంధించి హార్డ్ డిస్క్ ను లావణ్య పోలీసులకు అప్పగించడంతో ఈ కేసు వ్యవహారం మరోసారి వార్తల్లో కెక్కింది. ఈ నేపథ్యంలో మస్తాన్ సాయి తో పాటు మరో యువకుడిని అరెస్టు చేసిన పోలీసులు మస్తాన్ సాయి పై బిఎన్ఎస్ యాక్ట్ లోని 329(4), 324(4), 109, 77,78 లో కింద కేసు నమోదు చేసి అరెస్ట్ చేసారు.

Also Read : Thandel : తండేల్ సినిమాని ఎవరికి ఇవ్వొద్దు.. నిర్మాతల ఆదేశం.?

తాజాగా మస్తాన్ సాయి కేసులో కొత్త కోణం వెలుగులోకి వచ్చింది. ఒక్కొక్కటిగా మస్తాన్ సాయి ఆగడాల బయటకు వస్తున్నాయి. గతంలో బాధిత మహిళలు ఫిర్యాదు చేసేందుకు పోలీస్ స్టేషన్ కు వెళ్తుంటే మరోసారి బ్లాక్ మెయిల్ చేసి ఆత్మహత్య చేసుకుంటున్నాను అని ఫ్యాన్ కి ఉరి బిగించుకుని ఏడుస్తూ వీడియో కాల్ చేసిన వీడియోలు బయటకు వస్తున్నాయి. ఇప్పుడు మస్తాన్ సాయి అరెస్ట్ కావడంతో ఒక్కొక్కరు గా బయటకు వస్తున్నారు సదరు బాధిత మహిళలు. వందల మంది మహిళలను ట్రాప్ చేసి వారిని శారీరకంగా అనుభవించి వారికి తెలియకుండా వీడియోలు రికార్డ్ చేసాడు మస్తాన్ సాయి. అలా రికార్డ్ చేసిన వీడియోలతో మరోసారి బ్లాక్ మెయిల్ చేసి పలుమార్లు అత్యాచారం చేసి యువతులను బూతులు తిడుతూ మానసిక క్షోభ కి గురి చేసాడు మస్తాన్ సాయి. రానున్న రోజుల్లో ఈ కేసులో మరిన్ని సంచలనాలు బయటకు వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది.