A lavish 5-story glass set for the Adivi Sesh starrer G2: టాలీవుడ్ కుర్ర హీరో అడివి శేష్ వరుస విజయాలు అందుకుంటూ దూసుకెళ్తున్నాడు. గతేడాది హిట్ 2 తో హిట్ అందుకున్న ఈ హీరో తన గత సూపర్ హిట్ సినిమాకు సీక్వెల్ ను మొదలుపెట్టాడు. 2018 లో గూఢచారి సినిమాతో మంచి హిట్ ను అందుకున్న అడివి శేష్, ఆ సినిమాకు సీక్వెల్ ను అప్పుడే ప్రకటించి ఈ ఏడాది మొదట్లో జీ2ను పట్టాలెక్కించాడు. శశికిరణ్ తిక్కా దర్శకత్వం వహించిన గూఢచారి చిత్రానికి శేష్ కథను అందించారు, ఒకరకంగా గూఢచారి సినిమాలు మరుగున పడిపోతున్న సమయంలో ఈ సినిమా ఒక పెద్ద సెన్సేషన్ క్రియేట్ చేసిందనే చెప్పాలి. ఇక ఈ సినిమాకు కొత్త డైరెక్టర్ యాడ్ అయ్యాడు. శశి కిరణ్ తిక్కా ప్లేస్ లో “మేజర్” ఎడిటర్ వినయ్ కుమార్ శిరిగినీడి వచ్చాడు, అతనికి ఇదే మొదటి చిత్రం.
Bootcut Balaraju Teaser: బిగ్‌బాస్ ఫేమ్ సోహెల్ కొత్త సినిమా టీజర్.. భలే ఉందే
ఇకపోతే కాశ్మీర్ ఫైల్స్, కార్తికేయ 2 మరియు మేజర్ వంటి ఆల్ ఇండియా హిట్‌లను అందించిన పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ – ఎకె ఎంటర్‌టైన్‌మెంట్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ బ్యానర్‌లపై ప్రముఖ నిర్మాతలు టిజి విశ్వ ప్రసాద్ – అభిషేక్ అగర్వాల్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. నిజానికి ‘G2’ ఫస్ట్ లుక్ విడుదలైనప్పటి నుంచే ఈ చిత్రంపై అంచనాలు పెరిగాయి. సినిమా స్కేల్ మరింత పెద్దదిగా కనిపిస్తోంది. బనితా సంధు హీరోయిన్ గా నటిస్తున్న యాక్షన్ స్పై థ్రిల్లర్ ఇప్పుడు సెట్స్ పైకి వెళ్ళింది. G2 షూటింగ్ హైదరాబాద్‌లో ప్రారంభమైంది. మొదటి దశ నుంచి అంతర్జాతీయ స్థాయిలో ఈ సినిమా రూపొందుతోంది. ఈ సినిమా షూటింగ్ కోసం హైదరాబాద్‌లో 5 అంతస్తుల లావిష్ గ్లాస్ సెట్‌ను నిర్మించారు. ఇక షూట్ లో క్రిస్ప్ సూట్ ధరించిన అడివి శేష్ అందరిని ఆకట్టుకున్నారు.
