NTV Telugu Site icon

Devara: చిమ్మ చీకట్లో తెరకెక్కించిన ఫైట్… దేవరకే హైలైట్

Devara

Devara

జనతా గ్యారేజ్ కాంబినేషన్ ని రిపీట్ చేస్తూ కొరటాల శివ, ఎన్టీఆర్ కలిసి చేస్తున్న సినిమా ‘దేవర’. ఆచార్య సినిమా ఫ్లాప్ అయిన తర్వాత దేవర సినిమా ఆగిపోతుందని ప్రతి ఒక్కరు అనుకున్నారు కానీ ఎన్టీఆర్ మాత్రం కథని, కొరటాల శివని నమ్మి ప్రాజెక్ట్ ని క్యాన్సిల్ చెయ్యకుండా ముందుకి తీసుకొని వెళ్లాడు. అభిమానుల నుంచి, ఫిలిం ఫెటర్నిటీ నుంచి, మీడియా నుంచి… ఇలా ప్రతి చోటుని ఇంకెన్ని రోజులు డిలే చేస్తారు అనే కామెంట్స్ వినిపించినా కూడా కొరటాల శివకి కావాల్సినంత సమయం ఇచ్చాడు ఎన్టీఆర్. దాదాపు ఏడాది పాటు కేవలం ప్రీప్రొడక్షన్ మాత్రమే జరిగింది అంటే దేవర సినిమా విషయంలో కొరటాల శివకి ఎన్టీఆర్ ఎలాంటి ఫ్రీడమ్ ఇచ్చాడో అర్ధం చేసుకోవచ్చు. ఆ ఫ్రీడమ్ ఇప్పుడు దేవర సినిమా షూటింగ్ ఎఫెక్టివ్ గా జరగడానికి ఉపయోగపడుతుంది. మూడున్నర నెలల్లో నాలుగు మేజర్ షెడ్యూల్స్ ని జెట్ స్పీడ్ లో కంప్లీట్ చేసారు అంటే కొరటాల శివ ఎంత ప్రిపేర్డ్ గా ఉన్నాడో అర్ధం చేసుకోవచ్చు.

లేటెస్ట్ గా నైట్ ఎఫెక్ట్ లో ఒక భరో యాక్షన్ ఎపిసోడ్ ని షూట్ చేసారు. సినిమాటోగ్రాఫర్ రత్నవేలు ఈ ఫైట్ గురించి రివీల్ చేస్తూ… “లో లైట్ లో, అలల మధ్య ఎన్టీఆర్ తో అర్రి అలెక్సా LF సిగ్నేచర్ ప్రైమ్ లెన్స్ వాడి ఒక యాక్షన్ ఎపిసోడ్ ని షూట్ చేసాం” అంటూ ట్వీట్ చేసాడు. మామూలుగానే సముద్రం బ్యాక్ డ్రాప్ లో యాక్షన్ ఎపిసోడ్ అంటే స్రీన్ పైన విజువల్ గ్రాండియర్ ఉంటుంది. అలాంటిది నైట్ ఎఫెక్ట్ లో, లో లైట్ లో షూట్ చేసారు అంటే ఆన్ స్క్రీన్ ఆ ఫైట్ చూసినప్పుడు ఆడియన్స్ థ్రిల్ అవ్వడం గ్యారెంటీ. ఈ షెడ్యూల్ కంప్లీట్ అయ్యాకే ఎన్టీఆర్ దుబాయ్ వెళ్లాడు. ఎన్టీఆర్ తిరిగిరాగానే దేవర కొత్త షెడ్యూల్ స్టార్ట్ అవ్వనుంది, ఇదే స్పీడ్ ని మైంటైన్ చేస్తూ నవంబర్ చివరికి దేవర షూటింగ్ పార్ట్ ని కంప్లీట్ చెయ్యడానికి కొరటాల శివ అండ్ టీం రెడీ అవుతున్నారు.

Show comments