హిలేరియస్ కామెడీతో తక్కువ టైంలోనే తమిళ తంబీలకు దగ్గరయ్యాడు సంతానం. కమెడియన్‌గా కెరీర్ పీక్స్‌కు వెళ్లినప్పుడు హీరోగా మారాడు. మర్యాద రామన్న తమిళ వర్షన్‌తో భారీ సక్సెస్ కొట్టడంతో హీరోగా ప్రయత్నాలు స్పీడప్ చేశాడు. అలా అతడి కెరీర్‌కు టర్నింగ్ ఇచ్చిన మూవీ ధిల్లకు దుడ్డు. ఈ హారర్ కామెడీకి మంచి అప్లాజ్, కలెక్షన్స్ రావడంతో ధిల్లకు దుడ్డు, ధిల్లకు దుడ్డు 2, డీడీ రిటర్న్స్ ఇలా సీక్వెల్స్ తీసుకువచ్చాడు సంతానం. ఇప్పుడు ఈ సిరీస్ నుండి డెవిల్స్ డబుల్ నెక్ట్స్ లెవల్ ( డీడీ) వస్తోంది.
Also Read : Siddharth : 3BHK.. ఫర్ సేల్.. ఎవరు కొన్నారంటే.?
ఇప్పుడు ఈ సినిమాపై కోలీవుడ్‌లో కొత్త వివాదం రేగింది. డీడీ నెక్ట్స్ లెవెల్ సినిమాలో శ్రీనివాస గోవింద పాటను పేరడీ చేశారు. అది తిరుమల శ్రీవారిని అవమానించడమేనని హిందూ సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. వెంటనే ఆ పాటను తొలగించాలని డిమాండ్ చేస్తున్నాయి హిందూ సంఘాలు. అయితే వివాదంపై స్పందించిన నటుడు,హీరో సంతానం మాట్లాడుతూ ‘ తిరుమల శ్రీవారిని అవమానించలేదు. సినిమా ఇప్పటికే సెన్సార్ పూర్తయ్యింది. సెన్సార్ బోర్డు ఎలాంటి అభ్యంతరం చెప్పలేదు. రోడ్డుమీదా పోయో ప్రతి ఒక్కరు ఎదో ఒకటి మాట్లాడుతారు, వాటికి సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు. నిబంధనల ప్రకారమే సినిమా తీశాం. ఎవరికీ వివరణ ఇవ్వాల్సిన అవసరం లేదు’ అని అన్నాడు. మరోవైపు సినిమాలో పాటపై తమిళనాడులోని పలు పోలీస్‌స్టేషన్లలో డీడీ నెక్ట్స్ లెవెల్ చిత్ర హీరో, మేకర్స్ పై ఫిర్యాదులు చేసారు హిందూ సంఘాలు. కాగా ఈ సినిమా ఈ నెల 16న వరల్డ్ వైడ్ గా రీలీజ్ కానుంది.
