Site icon NTV Telugu

Rohan: జూనియర్ నవీన్ పోలిశెట్టి.. శివాజీ రీల్ కొడుకు.. ఏం చెప్పాడ్రా డైలాగ్

Naveen

Naveen

Rohan: ఒకప్పుడు బాలనటులు అంటే.. చాలా తక్కువ మందే ఉండేవారు. ఎక్కువ సినిమాల్లో వారే కనిపించేవారు. కానీ, ఇప్పుడు అలా లేదు. కొత్త కొత్తవారు వస్తున్నారు. ఎవరు ఏ భాషకు చెందినవారో తెలుసుకోవడం కూడా కష్టంగా ఉంది. ఇక ఈ మధ్యకాలంలో చైల్డ్ ఆర్టిస్ట్ రోహన్ పేరు బాగా వినిపిస్తుంది. #90s వెబ్ సిరీస్ తో రోహన్ మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఆదిత్య అనే పాత్రలో అతడు నటించాడు అనడం కన్నా జీవించాడు అని చెప్పాలి. ఈ సిరీస్ కన్నా ముందు రోహన్ చాలా సినిమాల్లో, సీరియల్స్ లో కూడాకనిపించి మెప్పించాడు. ఇక #90s వెబ్ సిరీస్ తో బాగా పాపులర్ అయిన రోహన్.. ప్రస్తుతం వరుస ఇంటర్వ్యూలు ఇస్తూ.. తనలోని టాలెంట్ ను బయటపెడుతున్నాడు. ఇక తాజాగా ఒక ఇంటర్వ్యూలో తన ఫేవరేట్ హీరో గురించి చెప్పి షాక్ ఇచ్చాడు. తనకు నవీన్ పోలిశెట్టి అంటే ఇష్టమని చెప్పుకొచ్చాడు.

” నాకు నవీన్ పోలిశెట్టి అంటే చాలా ఇష్టం. అతనే నాకు ఫేవరేట్ హీరో. అతనే ఎందుకు అంటే.. చాలా స్పాంటేనియస్ గా నవ్విస్తాడు. అతని నుంచి నేను చాలా నేర్చుకున్నాను” అని చెప్పుకొచ్చాడు. అంతేకాకుండా నవీన్ పోలిశెట్టి ఫేమస్ హిందీ డైలాగ్ ను గుక్కతిప్పుకోకుండా చెప్పుకొచ్చాడు. చదువు గురించి, ఇంగ్లీష్ మీడియం గురించి నవీన్ చెప్పిన మోనోలాగ్ డైలాగ్ ను రోహన్ అదరకుండా బెదరకుండా చెప్పుకొచ్చాడు. ఆ డైలాగ్ దాదాపు రెండు నిమిషాలు ఉంది. ఇక రెండు నిమిషాల డైలాగుని ఈ బుడ్డోడు కొంచెం కూడా తడబడకుండా చెప్పడంతో చాలామంది ఈ బుడ్డోడి వీడియో చూసి తెగ మెచ్చుకుంటున్నారు. అంతేకాదు భవిష్యత్తులో వీడికి మంచి మంచి అవకాశాలు వస్తాయని, మాస్టర్ భరత్ లాగా ఇండస్ట్రీలో మంచి గుర్తింపు తెచ్చుకుంటాడని కామెంట్లు పెడుతున్నారు. మరి ముందు ముందు ఈ కుర్రాడు ఎలాంటి సినిమాల్లో నటిస్తాడో చూడాలి.

Exit mobile version