Site icon NTV Telugu

7/G Brundavan Colony : రీ రిలీజ్ కు సిద్దమైన కల్ట్ క్లాసిక్ మూవీ..?

Whatsapp Image 2023 08 10 At 12.53.36 Pm

Whatsapp Image 2023 08 10 At 12.53.36 Pm

టాలీవుడ్ లో రీ రిలీజ్ ట్రెండ్ కొనసాగుతుంది. తమ అభిమాన స్టార్ హీరోల బర్త్డే సందర్భంగా వారి బ్లాక్ బస్టర్ మూవీస్ ని మళ్ళీ రీ రిలీజ్ చేస్తున్నారు.స్టార్ హీరోల సినిమాలే కాకుండా “‘ఈ నగరానికి ఏమైంది” వంటి చిన్న సినిమాను కూడా రి రిలీజ్ చేసి ఆకట్టుకున్నారు. తాజాగా 2004 లో బ్లాక్ బస్టర్ విజయం సాధించిన యూత్ ఫుల్ లవ్ ఎంటర్ టైనర్ ‘7/G బృందావన్ కాలనీ’ మూవీని మరోసారి విడుదల చేయబోతున్నారు. ఈ సినిమా లో రవికృష్ణ, సోనీ అగర్వాల్ జంటగా నటించారు.ఈ సినిమాను టాలెంటెడ్ దర్శకుడు సెల్వ రాఘవన్ తెరకెక్కించారు.ఈ సినిమా అప్పట్లో మంచి క్లాసిక్ లవ్ స్టోరీ గా పేరు తెచ్చుకుంది.

ఈ సినిమా తెలుగు మరియు తమిళం లో భారీ విజయం సాధించింది.ఈ మూవీ ఇప్పటికీ లవ్ స్టోరీస్ లో ఎవర్ గ్రీన్ మూవీ అని చెప్పొచ్చు.లవ్ అండ్ ఎమోషన్స్ తో పాటు కామెడీ కూడా ఇందులో ప్రధానంగా చూపించారు దర్శకుడు సెల్వ రాఘవన్.. ముఖ్యంగా సుమన్ శెట్టి చేసిన కామెడీ ఈ సినిమా కు ఎంతో హైలెట్ గా నిలుస్తుంది.ఇక ఈ సినిమా మ్యూజిక్ వేరే లెవెల్ అని చెప్పొచ్చు..ఈ సినిమాకు యువన్ శంకర్ రాజా అందించిన మ్యూజిక్ అద్భుతం.. ఇప్పటికీ ఈ సినిమా పాటలు వినిపిస్తూనే ఉంటాయి.అయితే త్వరలోనే ఈ మూవీకి సీక్వెల్ రాబోతున్నట్లు ప్రచారం కూడా జరుగుతుంది.. దీంతో మూవీ లవర్స్ ఈ సీక్వల్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. తాజాగా ఈ సినిమాను 4k ప్రింట్ లోకి మార్చి మళ్ళీ రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. కానీ ఇప్పటి వరకు రీ రిలీజ్ తేదీని మాత్రం ప్రకటించలేదు. మరికొన్ని రోజుల్లోనే నిర్మాతలు విడుదల తేదీని అధికారికంగా ప్రకటించబోతున్నారు.. దీంతో మరోసారి ‘7/G బృందావన్ కాలనీ’ మళ్ళీ థియేటర్లో సందడి చేయబోతుంది.

Exit mobile version