Colour Photo:ప్రస్తుతం చిత్ర పరిశ్రమలో చిన్న సినిమాలు తమ సత్తాను చాటుతున్నాయి. కథ బావుండాలే కానీ ప్రేక్షకులు చిన్నా, పెద్ద.. స్టార్స్ అని చూడకుండా సినిమాను ఎంకరేజ్ చేస్తున్నారు. తాజాగా ఒక చిన్న సినిమా జాతీయ అవార్డును అందుకోవడం హాట్ టాపిక్ గా మారింది. తాజాగా ప్రభుత్వం 68వ జాతీయ సినిమా అవార్డులను ప్రకటించింది. బెస్ట్ ఫీచర్ ఫిల్మ్ తెలుగు కేటగిరీలో ‘కలర్ ఫోటో’ చిత్రం అవార్డు గెలుచుకోంది. 2020 సంవత్సరంలో రిలీజ్ అయిన ఈ సినిమా భారీ విజయాన్ని నమోదు చేసుకోంది.
సుహాస్, చాందినీ చౌదరి జంటగా సందీప్ రాజ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకొంది. ఇద్దరు ప్రేమికుల మధ్య కులం అడ్డుగోడగా ఉండడంతో వారు జీవితాలు చివరికి ఏమయ్యాయి అని ఎంతో హృద్యంగా ఈ సినిమాను తెరకెక్కించాడు దర్శకుడు. ఇక ఈ సినిమాలో సునీల్ విలన్ గా నటించాడు. చిన్న చిత్రంగా 2020 అక్టోబర్ 23 న రిలీజ్ అయిన ఈ సినిమా భారీ విజయాన్ని నమోదు చేసుకొంది. ఇక ఈ సినిమాకు బెస్ట్ ఫీచర్ ఫిల్మ్ కేటగిరిలో జాతీయ అవార్డు రావడం ఎంతో ఆనందంగా ఉందని చిత్ర బృందం తెలుపుతున్నారు.