Site icon NTV Telugu

68th National Film Awards : జాతీయ చలనచిత్ర అవార్డుల్లో తెలుగువారికి నాలుగే!

68 National Film Awards

68 National Film Awards

68th National Film Awards  :

శుక్రవారం సాయంత్రం 68వ జాతీయ చలనచిత్ర అవార్డులను ఢిల్లీలో ప్రకటించారు. 2020 సంవత్సరానికి గాను ఈ అవార్డులను ప్రకటించడం గమనార్హం! ఇందులో తెలుగువారికి నాలుగు అవార్డులు లభించాయి. ఇందులో ఉత్తమ తెలుగు చిత్రంగా ‘కలర్ ఫోటో’ ఎన్నికయింది. సందీప్ రాజ్ దర్శకత్వంలో సాయి రాజేశ్ నీలం, బెన్నీ ముప్పనేని నిర్మించిన ‘కలర్ ఫోటో’ చిత్రానికి ఉత్తమ ప్రాంతీయ చిత్రంగా అవార్డు లభించింది. సంధ్యారాజు నటించి, నిర్మించి, నాట్యం సమకూర్చిన ‘నాట్యం’ చిత్రానికి రెండు అవార్డులు లభించాయి.

అందులో ఒకటి బెస్ట్ కొరియోగ్రఫికి సంధ్యారాజు ఎన్నిక కాగా, అదే చిత్రం ద్వారా టి.వి. రాంబాబు బెస్ట్ మేకప్ ఆర్టిస్ట్ గా ఎంపికయ్యారు. ఇక 2020 సంక్రాంతి సంబరాల్లో భలేగా సందడి చేసిన ‘అల వైకుంఠపురములో’ చిత్రం ద్వారా ఆ సినిమా సంగీత దర్శకుడు ఎస్.థమన్ కు బెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్ గా అవార్డు లభించింది.

Exit mobile version