టాలీవుడ్ లో సంక్రాంతి సంబరం… పోటీకి సై అంటున్న చిన్న సినిమాలు !!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
‘ఆర్ఆర్ఆర్’ సంక్రాంతి రేసు నుంచి తప్పుకోవడంతో చిన్న సినిమాలన్నీ సందడి చేయడానికి క్యూ కడుతున్నాయి. ఇప్పటికే సిద్ధు జొన్నలగడ్డ ‘డిజె టిల్లు’ జనవరి 14న, అశోక్ గల్లా ‘హీరో’ మూవీ జనవరి 15న, డిసెంబర్ 31న విడుదల కావాల్సిన రానా ‘1945’ చిత్రాన్ని జనవరి 7న రిలీజ్ చేస్తున్నట్టు ప్రకటించారు. ఇక సంక్రాంతి బరిలోనే నాగార్జున, నాగచైతన్య ‘బంగార్రాజు’ రాబోతోంది. మరి కొందరు చిన్న చిత్రాల నిర్మాతలు కూడా తమ చిత్రాలను విడుదల చేయడానికి రంగం సిద్ధం చేసుకుంటున్నారు. తాజాగా మరో మూడు సినిమాలు విడుదల తేదీలను ప్రకటించాయి.
“7 డేస్ 6 నైట్స్”
టాలీవుడ్ ప్రముఖ నిర్మాత ఎం.ఎస్.రాజు దర్శకుడిగా కొత్త సినిమాతో సంక్రాంతి రేసులోకి వస్తున్నాడు. “7 డేస్ 6 నైట్స్” చిత్రం జనవరి 14న థియేటర్లలో విడుదల కానుంది. ఈ సినిమా విడుదల తేదీని దర్శకుడు ఎంఎస్ రాజు స్వయంగా ధృవీకరించారు. సుమంత్ అశ్విన్, మెహర్ చావల్ ప్రధాన జంటగా నటించిన ఈ నవయుగ రోమ్-కామ్‌కి సమర్థ్ గొల్లపూడి సంగీతం, నాని చమిడిశెట్టి సినిమాటోగ్రఫీ అందించారు.
Also Read
- Christopher Nolan : ఫ్రాంచైజీ లేదు.. సూపర్‌హీరో లేడు.. కానీ బిలియన్ డాలర్లు వసూలు చేసింది
- Gaja Teaser: మంచు మనోజ్ చేతుల మీదుగా ‘గజ’ టీజర్ రిలీజ్.. షాకుల మీద షాకులు ఇస్తున్న ట్విస్ట్‌లు !
- Ajith Kumar : అజిత్ కుమార్ - విక్టరీ వెంకటేష్ - మోహన్ లాల్.. భారీ పాన్ ఇండియా సినిమా?
- King 100: నాగ్100పై సస్పెన్స్‌కు తెర.. ఆగస్టు 29న ఫస్ట్ లుక్, స్పెషల్ గ్లింప్స్!
“సూపర్ మచ్చి”
టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి అల్లుడు కళ్యాణ్ దేవ్ రెండవ చిత్రం ‘సూపర్ మచ్చి’ విడుదల తేదీ లాక్ అయ్యింది. పులి వాసు దర్శకత్వం వహించిన ఈ యాక్షన్ ఎంటర్టైనర్ జనవరి 14న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. కన్నడ నటి రచితా రామ్ ఈ సినిమాలో కళ్యాణ్ దేవ్ కి జోడీగా నటిస్తోంది. రిజ్వాన్ తన హోమ్ బ్యానర్ రిజ్వాన్ ఎంటర్టైన్మెంట్పై నిర్మించిన ఈ చిత్రానికి సంచలన స్వరకర్త ఎస్ఎస్ థమన్ సంగీతం అందించారు.
“రౌడీ బాయ్స్”
ప్రముఖ నిర్మాత, డిస్ట్రిబ్యూటర్ దిల్ రాజు మేనల్లుడు ఆశిష్ రెడ్డి ‘రౌడీ బాయ్స్’ సినిమాతో తెరంగేట్రం చేస్తున్న సంగతి తెలిసిందే. హర్ష కొనుగంటి దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఇప్పుడు జనవరి 14న విడుదల కానుంది. మేకర్స్ ఈరోజు అధికారికంగా వార్తలను ప్రకటించారు. ఈ రొమాంటిక్ యాక్షన్ ఎంటర్టైనర్లో సహిదేవ్ విక్రమ్, కార్తీక్ రత్నం, తేజ్ కూరపాటి మరియు కోమలి ప్రసాద్ కూడా కీలక పాత్రలు పోషిస్తున్నారు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై దిల్ రాజు, శిరీష్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించారు. అనుపమ పరమేశ్వరన్ ‘రౌడీ బాయ్స్’ హీరోయిన్.
‘డిజె టిల్లు’ – జనవరి 14
‘హీరో’ – జనవరి 15
‘1945’ – జనవరి 7

తాజావార్తలు
-
Christopher Nolan : ఫ్రాంచైజీ లేదు.. సూపర్‌హీరో లేడు.. కానీ బిలియన్ డాలర్లు వసూలు చేసింది
-
Sunil Gavaskar: ఆ రోజుల్లోనే సునీల్ గవాస్కర్ పెను సాహసం.. విషయం తెలిస్తే షాక్ అవ్వకుండా ఉండలేరు!
-
Explainer: ఉద్యోగాల కోసం ఎదురుచూపులు.. ఆగిపోతున్న గుండెలు.. ఇంకెన్నాళ్లీ బాధలు?
-
Gaja Teaser: మంచు మనోజ్ చేతుల మీదుగా ‘గజ’ టీజర్ రిలీజ్.. షాకుల మీద షాకులు ఇస్తున్న ట్విస్ట్‌లు !
-
Sourav Ganguly Death Threats: మిమ్మల్ని చంపేస్తాం.. సౌరవ్ గంగూలీ, సతీమణి డోనాకి బెదిరింపులు!
ట్రెండింగ్
-
7,000mAh బ్యాటరీ, 50MP సోనీ కెమెరా, FHD+ LCD 120Hz డిస్ప్లేతో వచ్చేందుకు సిద్దమైన Moto G Max..!
-
రూ.8,499కే Lava Smart 4 లాంచ్.. మిలిటరీ-గ్రేడ్ డ్యూరబిలిటీ, 5000mAh బ్యాటరీ, 90Hz LCD డిస్ప్లేతో బడ్జెట్ ఫోన్..!
-
Kitchen Hacks : నూనె సీసాల జిడ్డు పోవాలంటే.. ఈ 4 చిట్కాలు ట్రై చేయండి.!
-
Bathroom Drain Cleaning Tips : బాత్రూమ్ డ్రెయిన్ జామ్ అవుతోందా? ఈ 2 పదార్థాలతో చిటికెలో క్లీన్.!
-
Home Hacks : కడాయి హ్యాండిల్‌పై గట్టి జిడ్డా? ఈ చిట్కాలతో కొత్తదానిలా మెరిపించండి.!