Site icon NTV Telugu

Nandamuri Balakrishna : 50 ఏళ్లు హీరోగా.. ప్రపంచంలో ఏవరూ లేరు

Nbk

Nbk

గాడ్ ఆఫ్ మాస్ నందమూరి బాలకృష్ణకు కళా రంగంలో విశిష్ట సేవలు అందించినందుకు గాను పద్మభూషణ్‌ అవార్డు అందుకున్న సంగతి తెలిసిందే. ఇటీవల రాష్ట్రపతి ముర్ము చేతులు మీదుగా ఆ అవార్డు అందుకున్నారు బాలయ్య. ఈ సందర్భంగా బాలయ్య శాసనసభ్యుడిగా వ్యవహరిస్తున్న హిందూపురంలో ఆయన అభిమానులు భారీ సన్మాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి అటు పార్టీ శ్రేణులు ఇటు బాలయ్య అభిమానులు భారీ సంఖ్యలో హాజరయ్యారు. అలాగే మాజీ మంత్రి పల్లె రఘునాథ్‌రెడ్డి, పుట్టపర్తి ఎమ్మెల్యే పల్లె సింధూరరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Also Read : MEGA 157 : మెగా – అనిల్ షూటింగ్ ఎప్పటినుండో తెలుసా.?

ఈ సందర్భంగా నందమూరి బాలకృష్ణ మాట్లాడుతూ ” అందరికి నమస్కారం. మీ అభిమానం, మీ ప్రేమ వెలకట్టలేనిది. ముఖ్యంగా హిందూపురం నియాజకవర్గ ప్రజలకు ఎంతో రుణపడి ఉంటాను. ఎమ్మెల్యే గా ఇక్కడి నుండి నన్ను మూడు సార్లు గెలిపించారు. నటుడు అయినంత మాత్రాన ఎమ్మెల్యే కావాలని ఎక్కడ లేదు. ఎంతో మంది నటులు రాజకీయాల్లోకి వచ్చారు. నామరూప లేకుండా అడ్రస్ లేకుండాపోయారు. ముఖ్యంగా రామారావు కొడుకని నన్ను గెలిపించలేదు. హిందూపురంలో పనిచేశాను కాబట్టే నన్ను గెలిపించారు. మనం సమాజానికి ఎంత సేవ చేసామన్నది ముఖ్యం. అప్పుడే చరిత్రలో మనం నిలిచిపోతాం. నా కెరియర్లో 50 సంవత్సరాలుగా చిత్రపరిశ్రమలో లో హీరోగా ఉన్నాను. బహుశా ప్రపంచంలో ఇన్నేళ్లు హీరోగా ఉన్న వాళ్ళు ఎవరు లేరు. అవకాశాలు తగ్గాకా క్యారెట్ ఆర్టిస్ట్ గా వెళ్ళిపోతూ ఉంటారు. నన్ను ఇంత వాడిని చేసిన మీకు, తెలుగు జాతికి పేరు పేరునా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. అందరూ నన్ను చూసి చాలామంది పొగరు ఎక్కువ అని అంటారు. నన్ను ఉసిగొలిపే ప్రతి దానికి నేను ముక్కు సూటిగా మాట్లాడుతాను.నా నిజాయితీ నిబంధన మానవత్వం, నా వ్యక్తిత్వం ఉన్నందునే ముందు ముందు కూడా నా అభిమానులు పుడుతూనే ఉంటారు.

Exit mobile version