విక్టరీ వెంకటేష్ లేటెస్ట్ సినిమా ‘సంక్రాంతికి వస్తున్నాం’ బ్లాక్ బస్టర్ విజయంతో తెలుగు చలనచిత్ర పరిశ్రమలో ఒక సెన్సేషన్ విజయాన్ని సాధించింది. సంక్రాంతి కానుకగా రిలీజ్ అయిన ఈ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ బాక్సాఫీస్ రికార్డులను బద్దలు కొట్టడమే కాకుండా, ఇప్పటివరకు రూ. 303 Cr+ గ్రాస్ దాటిన మొదటి తెలుగు ప్రాంతీయ చిత్రంగా చరిత్రలో తన పేరును లిఖించింది. సీనియర్ నటులలో రూ. 300 కోట్ల గ్రాసర్‌ను అందించిన మొదటి హీరోగా వెంకీ మరో రికార్డు నెలకొల్పాడు.
Also Read : NTRNeel : డ్రాగన్ రాక.. కాస్త ఆలస్యం
హిట్ మేకర్ అనిల్ రావిపూడి దర్శకత్వం వహించిన, సంక్రాంతికి వస్తున్నాం హాస్యం, భావోద్వేగం మరియు సాపేక్షమైన కథనాన్ని మిళితం చేసి ప్రేక్షకులను ఆకట్టుకునే కథలు రాయడంలో అనిల్ రావిపూడి యొక్క నేర్పు మరోసారి ఫలించింది. తాజాగా ఈ సినిమా మరో రేర్ ఫీట్ సాధించింది. కనీసం రెండు లేదా మూడు వారాలు ఆడితే గగనం అవుతున్న ఈ రోజుల్లో సంక్రాంతికి వస్తున్నాం 50 రోజుల థియేట్రీకల్ రన్ ఫినిష చేసుకుంది. రెండు తెలుగు రాష్ట్రాల్లో 92 సెంటర్స్ లో ఈ సినిమా అర్ధశత దినోత్సవ వేడుక చేసుకుంటుంది. అటు నిర్మాతలు, ఇటు పంపిణీదారులు మరియు ఎగ్జిబిటర్లకు కనివిని ఎరుగని స్థాయిలో తెలుగు సినిమా చరిత్రలో అత్యంత లాభదాయకమైన వెంచర్‌లలో ఒకటిగా నిలిచి రికార్డుల కెక్కింది. అక్కడ ఇక్కడ అని తేడా లేకుండా సంక్రాంతికి వస్తున్నాం లాభాల పంట పండించింది. ఫైనల్ రన్ లో ఈ సినిమా ఎక్కడి వరకు వెళ్లి ఆగుతుందోనని ట్రేడ్ వర్గాలు చర్చించుకుంటున్నాయి.