Site icon NTV Telugu

“సర్కారు వారి పాట” తగ్గేదే లే !

33 M views for Super Star Birthday Blaster

సూపర్ స్టార్ మహేష్ బాబు పుట్టినరోజు సందర్భంగా ఆగష్టు 9న “సూపర్ స్టార్ బర్త్ డే బ్లాస్టర్” రిలీజ్ చేసిన విషయం తెలిసిందే. అప్పుడు మొదలైన “బ్లాస్టర్” తుఫాను ఇంకా తగ్గనేలేదు. 24 గంటల్లో 25.7 మిలియన్ వ్యూస్ సాధించి అన్ని రికార్డులను బ్లాస్ట్ చేసేసింది. అల్ టైం హైయెస్ట్ బిడ్ ఇన్ టాలీవుడ్ ఇండస్ట్రీగా “సర్కారు వారి పాట” టీజర్ రికార్డు క్రియేట్ చేసింది. 754కే+ లైక్స్ తో దూసుకెళ్లింది. “తగ్గేదే లే” అంటూ మరిన్ని రికార్డులను క్రియేట్ చేసే దిశగా సాగిపోతోంది. తాజాగా “సర్కారు వారి పాట” టీజర్ 33 మిలియన్ల వ్యూస్ దాటేసింది. అంతేకాదు 950కే వ్యూస్ తో దూసుకెళ్తోంది. ఈ విషయాన్ని మేకర్స్ ఓ పోస్టర్ విడుదల చేసి ప్రకటించారు.

Read Also : రికార్డ్స్ బ్రేక్ చేస్తున్న “భీమ్లా నాయక్”

యాక్షన్ ఎంటర్టైనర్ “సర్కారు వారి పాట” పరశురామ్ దర్శకత్వంలో తెరకెక్కుతోంది. ఈ సినిమాను మైత్రి మూవీ మేకర్స్, 14 రీల్స్ ప్లస్, జి. మహేష్ బాబు ఎంటర్టైన్మెంట్ బ్యానర్లు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఈ చిత్రంలో మహేష్ బాబు సరసన హీరోయిన్ గా కీర్తి సురేష్ నటిస్తున్నారు. సంక్రాంతి కానుకగా జనవరి 13న ఈ చిత్రం విడుదల కానుంది.

Exit mobile version